IPO News: గ్రేమార్కెట్లో దంచికొడుతున్న బజాజ్ ఐపీవో.. బెట్ వేస్తే కళ్లు తిరిగే లాభమే బ్రోర్స్..!!
Bajaj Housing Finance GMP: వరుసగా వస్తున్న అనేక ఐపీవోల మధ్య తళుక్కున మెరుస్తున్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఒకటి. మెయిన్ కేటగిరీలో వస్తున్న ఈ ఐపీవోపై ఇన్వెస్టర్లు చాలా కాలంగా దృష్టి సారిస్తున్నారు. తొలిరోజే పూర్తి సబ్‌స్క్రిప్షన్ పొందిన ఈ ఐపీవో గ్రేమార్కెట్లోనూ రికార్డుల మోత మోగిస్తూ తన సత్తా చాటుకుంటోంది.
వాస్తవానికి కంపెనీ ఇష్యూ సమయంలో ఒక్కో షేరుకు గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.70గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని కేటగిరీలకు చెందిన ఇన్వెస్టర్ల నుంచి విపరీతమైన డిమాండ్ కారణంగా గ్రేమార్కెట్లో భారీ ప్రీమియం రేటు పలుకుతోంది. శనివారం రోజున కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.82 జీఎంపీని కలిగి ఉన్నాయి. ఈ లెక్కన ఇదే ధర కొనసాగితే స్టాక్ తొలిరోజే ఇన్వెస్టర్లకు 100 శాతానికి పైగా లిస్టింగ్ గెయిన్స్ అందించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో స్టాక్ ధర ఏకంగా రూ.150కి పైన మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు సెప్టెంబర్ 16న BSE, NSEలలో లిస్ట్ కానున్నాయని తెలుస్తోంది. సోమవారం ఇదే ధరకు లిస్టింగ్ జరిగితే బెట్టింగ్ వేసి షేర్లను అలాట్మెంట్లో పొందిన లక్షలాధిమంది ఇన్వెస్టర్లు భారీగా లాభాలను అందుకుంటారు. రూ.82 ప్రీమియం అనేది వాస్తవ ఇష్యూ ధరకు దాదాపు 117 శాతం అధికం. వాస్తవానికి పెట్టుబడిదారుల కోసం కంపెనీ తన ఐపీవోను సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 11 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడింది.
ఐపీవోలో పాల్గొనేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.14,980 పెట్టుబడి పెట్టారు. 2008లో ప్రారంభించబడిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక నాన్-డిపాజిట్ టేకింగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. కంపెనీ 2015 నుంచి నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో రిజిస్టర్ చేయబడింది. కంపెనీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,758 కోట్లను సమీకరించింది. అలాగే షేర్ల ప్రైస్ బ్యాండ్ ధరను రూ.66-70గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. మెుత్తం రూ.6,560 కోట్ల విలువైన ఐపీవోలో రూ.3,000 కోట్లకు ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉందని కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications