Bajaj Houing Finance: దేశంలో ప్రస్తుతం ఐపీవోల కోలాహలం కొనసాగుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అనేక కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. అలాగే మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెరిగిన వేళ వచ్చిన ప్రతి ఐపీవో బంపర్ లిస్టింగ్ నమోదు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే బజాజ్ గ్రూప్ నుంచి మరో కంపెనీ ఐపీవోను తీసుకొస్తోంది.
బజాజ్ ఫైనాన్స్ అనుబంధ సంస్థ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.7,000 కోట్లను సమీకరించేందుకు సెబీ వద్ద ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. NBFC సంస్థ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ప్రకారం మాతృ సంస్థ బజాజ్ ఫైనాన్స్ ద్వారా రూ.4,000 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ, రూ.3,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ప్రస్తుత ఐపీవోలో కలిగి ఉంది. కంపెనీ తాజా ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయం భవిష్యత్ మూలధన అవసరాలను తీర్చడానికి, కంపెనీ మూలధనాన్ని పెంచడానికి ఉపయోగించాలని నిర్ణయించింది.

సెప్టెంబరు 2025 నాటికి ఎగువ-స్థాయి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను స్టాక్ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయాల్సిన RBI నిబంధనలకు అనుగుణంగా తాజా ఐపీవో వస్తోంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఇప్పటికే లిస్టింగ్ అయ్యాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది సెప్టెంబర్ 2015 నుంచి నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో రిజిస్టర్ చేయబడిన నాన్-డిపాజిట్-టేకింగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఇది గృహ, వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయడానికి, పునరుద్ధరించడానికి ఆర్థిక పరిష్కారాలను అందిస్తోంది.
గృహ రుణాల వ్యాపారంలో ఉన్న కంపెనీ FY24లో రూ.1,731 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అలాగే FY23లో రూ.1,258 కోట్ల లాభంతో పోల్చేతి కంపెనీ 38 శాతం వృద్ధిని నమోదు చేసింది. తాజాగా జూన్ 6న, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో రూ.3,000 కోట్ల విలువైన షేర్ల విక్రయానికి బజాజ్ ఫైనాన్స్ బోర్డు ఆమోదం తెలిపింది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2023-24 సంవత్సరానికి NBFCల కోసం స్కేల్-ఆధారిత నియంత్రణ కింద ఎగువ పొరలో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ల (NBFC) జాబితాను తీసుకువచ్చింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో పాటు, అప్పర్ లేయర్ లిస్ట్‌లో టాటా సన్స్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, షాంఘ్వీ ఫైనాన్స్ సంస్థలు సైతం జాబితాలో ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications