IPO News: నేడే మూడు పెద్ద ఐపీవోల ఓపెనింగ్.. బెట్టింగ్ వేసేందుకు ఇన్వెస్టర్స్ గెట్ రెడీ..
IPOs Opening: కొత్తవారంలో ఐపీవోల కోలాహలం మెుదలైంది. చాలా మంది ఇన్వెస్టర్లు ఈక్విటీల కంటే ఐపీవోలే బెటర్ రాబడులను అందిస్తున్నాయనే ఉద్ధేశంతో స్వల్పకాలిక పెట్టుబడి అవకాశాల కోసం వీటిని ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో నేడు మార్కెట్లోకి మూడు పెద్ద ఐపీవోలు ప్రారంభం అవుతున్నాయి.
ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఏకంగా 13 కంపెనీలు తమ ఐపీవోలను ప్రారంభిస్తున్నాయి. అయితే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, క్రాస్ లిమిటెడ్, టోలిన్స్ టైర్స్ కంపెనీల ఐపీవోలు మాత్రం నేడు అంటే సెప్టెంబర్ 9న బెట్టింగ్ వేయాలనుకునే వారికోసం తెరవబడుతున్నాయి. వీటి సబ్‌స్క్రిప్షన్ గడువు సెప్టెంబర్ 11తో ముగియనుంది. ఇదే క్రమంలో PN గాడ్గిల్ జ్యువెలర్స్ ఐపీవో సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 12 వరకు అందుబాటులో ఉండనుంది.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి దాదాపు రూ.6,560 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ రూ.1,100 కోట్లు, క్రాస్ లిమిటెడ్ రూ.500 కోట్లు, టోలిన్స్ టైర్స్ రూ.230 కోట్లు భారతీయ మార్కెట్ల నుంచి సమీకరించనున్నాయి. ఈ నాలుగు కంపెనీలు మొత్తం రూ.8,390 కోట్లు సమీకరించాలనుకుంటున్నాయి.
ఆదిత్య అల్ట్రా స్టీల్, శుభశ్రీ బయోఫ్యూయల్స్ ఎనర్జీ, షేర్ సొల్యూషన్స్, గజానంద్ ఇంటర్నేషనల్, SPP పాలిమర్స్, ట్రాఫిక్ ITS టెక్నాలజీస్, ఎక్సలెంట్ వైర్స్, ప్యాకేజింగ్, ఇన్నోమెట్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ఎన్విరోటెక్ సిస్టమ్స్ వంటి చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వచ్చే వారం ప్రారంభం కానున్నాయి. ఈ కంపెనీలు పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.12 నుంచి 45 కోట్ల వరకు సమీకరించాలని యోచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లలోకి ఎస్ఎమ్ఈ కేటగిరీ ఐపీవోలు భారీగా వస్తున్నాయి. వీటిలో రిటైలర్లు పెట్టుబడికి ఎక్కువ ఆసక్తి చూపటంపై సెబీ సహా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్వెస్ట్ చేయటానికి ముందు వివరాలు పూర్తిగా పరిశీలించాలని వారు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications