Bajaj CNG: మొట్టమొదటి సీఎన్జీ బైక్ డెలివరీ చేసిన బజాజ్ ఆటో..

ప్రపంచంలోనే మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్ అయిన బజాజ్ ఫ్రీడమ్ 125 కోసం దేశవ్యాప్తంగా బుకింగ్‌లను ప్రారంభించింది. రూ. 95,000 ఎక్స్-షోరూమ్ ధర, ఫ్రీడమ్ 125 మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. మొదటి మోటార్‌సైకిల్ పూణేలోని కస్టమర్‌కు డెలివరీ చేశారు. బజాజ్ ఫ్రీడమ్ 125 CNG చాలా సంచలనాన్ని సృష్టించింది. ద్విచక్ర వాహన పరిశ్రమలో గేమ్-ఛేంజర్‌గా మారే అవకాశంఉంది.

ఎందుకంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి CNG-ఆధారిత మోటార్‌సైకిల్ గా నిలిచింది. బజాజ్ ఫుల్ ట్యాంక్‌పై 330కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెప్పింది. బజాజ్ ఫ్రీడమ్ 125 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడినప్పుడు 9.3bhp, 9.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 125cc, సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఫ్రీడమ్‌లో 2-లీటర్ ఇంధన ట్యాంక్, 2 కిలోల CNG ట్యాంక్ రైడర్ సీటు కింద వచ్చింది.

Bajaj Freedom 125 CNG bike delivered in Pune

కొత్త ట్రేల్లిస్ ఫ్రేమ్‌లో చుట్టబడి ఉంటుంది. బజాజ్ ఫ్రీడమ్ 125 వేరియంట్ మోటార్‌సైకిల్ LED హెడ్‌లైట్, డిస్క్ లేదా డ్రమ్ బ్రేక్ ఆప్షన్, ఫోన్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుకవైపు మోనోషాక్‌ను పొందుతుంది. బజాజ్ ఫ్రీడమ్ 125 CNG మోటార్‌సైకిల్ హీరో స్ప్లెండర్ 125, హోండా షైన్ 125, సెగ్మెంట్‌లోని ఇతర 125cc కమ్యూటర్ మోటార్‌సైకిళ్లతో పోటీపడనుంది.అయితే డిజైన్ పరంగా, దాని CNG పవర్‌ట్రెయిన్ పరంగా ప్రత్యేకంగా నిలుస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+