Bajaj Finserv: ఆదాయం, లాభం రెండూ అదరహో.. స్టాక్ క్యూ2 ఫలితాల దూకుడు..

Bajaj Finserv Q2 Results: బజాజ్ ఫిన్‌సర్వ్ తాజాగా తన త్రైమాసిక ఫలితాలను నేడు ప్రకటించింది. మెరుగైన పనితీరుతో స్టాక్ సైతం లాభపడింది.

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బజాజ్ ఫిన్‌సర్వ్ రూ.1,929 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నమోదు చేసిన రూ.1,557 కోట్ల లాభం కంటే 24 శాతం వృద్ధి నమోదైంది. Q2FY24లో కంపెనీ ఏకీకృత ఆదాయం 25.1% పెరిగి రూ.20,803 కోట్ల నుంచి రూ.26,023 కోట్లకు చేరుకుంది. ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కంపెనీ బలమైన ఆపరేటింగ్ పనితీరును కనబరిచినట్లు ప్రకటించింది.

Bajaj Finserv reported stellar profits in Q2 with strong business, share boomed

వాస్తవానికి బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్ అనేది బజాజ్ గ్రూప్‌లోని వివిధ ఆర్థిక సేవల వ్యాపారాల కోసం హోల్డింగ్ కంపెనీ.సెప్టెంబర్ 2023తో ముగిసిన త్రైమాసికంలో దాని వివిధ అనుబంధ సంస్థల పనితీరును గమనిస్తే..

బజాజ్ ఫైనాన్స్ : Q2FY24కి బజాజ్ ఫైనాన్స్ మొత్తం ఆదాయం గత ఏడాదితో పోల్చితే 34 శాతం పెరిగి రూ.13,382 కోట్లుగా నమోదైంది. అలాగే పన్ను తర్వాత లాభం ఏడాది ప్రాతిపదికన 28 శాతం పెరిగి రూ.3,551 కోట్లకు చేరుకుంది. బలమైన AUM వృద్ధి, అధిక నికర వడ్డీ ఆదాయం, మెరుగైన ఆస్తి పనితీరును ప్రతిబింబిస్తోంది. సెప్టెంబర్ 30 నాటికి అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ 33 శాతం వృద్ధి చెంది రూ.290,264 కోట్లకు చేరుకున్నాయి. బజాజ్ ఫైనాన్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్ 52.45% వాటాను కలిగి ఉంది.

బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ : బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సెప్టెంబర్ త్రైమాసికంలో పన్ను తర్వాత లాభం ఏడాది ప్రాతిపదికన 39 శాతం వృద్ధి చెంది రూ.468 కోట్లుగా నివేదించింది. అలాగే నికర ఆర్జించిన ప్రీమియం రూ.2,250 కోట్లగా నమోదు చేసింది. త్రైమాసికంలో Gross written ప్రీమియం 53% పెరిగి రూ.7,298 కోట్లకు చేరుకుంది.

బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ : ఇక కంపెనీ జీవిత బీమా వ్యాపారం కూడా సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన పనితీరును కనబరిచింది. క్యూ2లో బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నికర లాభం 21 శాతం పెరిగి రూ.193 కోట్లకు చేరుకుంది. న్యూ బిజినెస్ ప్రీమియం 26 శాతం పెరిగి రూ.2,821 కోట్లుగా నమోదైంది. అయితే Gross written ప్రీమియం రూ.4,155 కోట్ల నుంచి రూ.5,338 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 14 శాతం పెరిగి రూ.98,700 కోట్లుగా ఉన్నట్లు త్రైమాసిక ఫలితాల్లో నివేదించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+