Bajaj Finserv FD: దేశంలో అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపులో ఒకటైన బజాజ్ ఫిన్సర్వ్ సూపర్ ఎఫ్‌డి ఆఫర్ ప్రకటించింది. మార్కెట్లో అనేక ఇతర సంస్థలతో పోల్చితే డిపాజిట్లపై అధిక వడ్డీని చెల్లిస్తోంది.
వినియోగదారులు బజాజ్ ఫిన్సర్వ్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ బుక్ చేసుకున్నట్లయితే వారికి ప్రత్యేకంగా 8.85 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా.. డిపాజిట్లని బుక్ చేయడానికి డిజిటల్, అసిస్టెడ్ డిజిటల్ పద్ధతిని ఉపయోగించేలా ఖాతాదారులను ప్రోత్సహించడం ద్వారా పొదుపు అనుభవాన్ని ఈ డిజిటల్ ఎఫ్‌డి పూర్తిగా మారుస్తోందని కంపెనీ అభిప్రాయపడింది.

బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా పెట్టుబడులు పూర్తిగా సురక్షితమైనవని, సులభతరమైనవని కంపెనీ వెల్లడించింది. 42 నెలల కాలానికి 60 ఏళ్లలోపు పెట్టుబడిదారులు చేసే ఎఫ్డిలకు గరిష్ఠంగా 8.60 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు మాత్రం ఇది 8.85 శాతంగా ఉంది. కొత్తగా చేసే డిపాజిట్లకు మెచ్యూరయిన డిపాజిట్లని 42 నెల్ల కాలపరిమితికి రెన్యువల్ చేసినప్పుడు కొత్తగా సవరించిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుత ఆఫర్ కింద గరిష్ఠంగా రూ.5 కోట్ల వరకు సొమ్మును డిపాజిట్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది.
గడచిన రెండేళ్ల కాలంలో కంపెనీ వద్ద పెరుగుతు డిపాజిట్లు ఖాతాదారుల నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఫిక్స్డ్ డిపాజిట్లు & ఇన్వెస్ట్మెంట్ట్స్, బజాజ్ ఫైనాన్స్ హెడ్ సచిన్ సిక్కా పేర్కొన్నారు. కంపెనీ సెప్టెంబర్ 30, 2023 నాటికి మెుత్తం రూ.54,821 కోట్ల డిపాజిట్ బుక్ కలిగి ఉంది. దేశంలోనే అత్యధిక డిపాజిట్లు స్వీకరించిన ఎన్బిఎఫ్సీగా రికార్డు సృష్టించింది. ఇదే క్రమంలో కంపెనీ యాప్ పెట్టుబడిదారులకు అనేక మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతో ఒకేచోట పెట్టుబడిదారులకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications