Penny Stocks: లక్ష పెట్టుబడిని రూ.23 కోట్లుగా మార్చిన ఫైనాన్స్ స్టాక్.. మీరూ కొన్నారేమో చూసుకోండి..

Multibagger Stock: మల్టీబ్యాగర్ స్టాక్ లకు మార్కెట్ల పనితీరుతో సంబంధం ఉండదు. మార్కెట్లు ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ అవి చాపకింద నీరులా పెరుగుతూనే ఉంటాయి. కొన్ని స్టాక్స్ కరోనా వల్ల అప్పుడు కొంత డీలా పడినప్పటికీ మళ్లీ పుంజుకుని మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందించాయి. ఇలా విలువ క్షీణించినప్పుడు మంచి స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టిన అనేక మంది తరువాతి కాలంలో మంచి రాబడును పొందుతున్నారు.

రూ.5 నుంచి పెరిగిన తీరు..

రూ.5 నుంచి పెరిగిన తీరు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది బజాజ్ ఫైనాన్స్ స్టాక్ గురించే. ఈ స్టాక్ ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్న ఒక ఉత్తమమైన, మంచి విలువ కలిగిన స్టాక్ అని చెప్పుకోవచ్చు. 2009 మార్చి సమయంలో ఈ స్టాక్ విలువ దాదాపుగా రూ. 5.09గా ఉంది. అప్పట్లో ఇదొక పెన్నీ స్టాక్. పైగా 2008 ఆర్థిక మాంద్యం తరువాత స్టాక్ మార్కెట్లు తీవ్రంగా దెబ్బతిన్న సమయం అది.

కరోనా సమయంలో కరెక్షన్..

కరోనా సమయంలో కరెక్షన్..

కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లోని స్టాక్ మార్కెట్ల మాదిరిగానే భారత స్టాక్ మార్కెట్లలోను కరెక్షన్ జరిగింది. 2020 ఏప్రిల్ సమయంలో ఈ స్టాక్ ధర రూ.28 వేల దిగువకు చేరుకుంది. ఆ తరువాత ఈ స్టాక్ గరిష్ఠంగా రూ.19 వేల మార్కును తాకింది.

2014 వరకు రిటర్న్స్ ఇలా..

2014 వరకు రిటర్న్స్ ఇలా..

2009-2014 మధ్య కాలంలో బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ధర కేవలం రూ.5 నుంచి రూ.155కు పెరిగింది. ఆ తరువాతే ఈ ఫైనాన్స్ స్టాక్ ను చాలా మంది ఇన్వెస్టర్లు గుర్తించారు. ఆ సమయంలో బజాజ్ ఫైనాన్స్ లో పెట్టుబడులు పెట్టిన వారు ఇప్పుడు కోటీశ్వరులు అయ్యేవారు. 2009లో ఒక వ్యక్తి ఈ స్టాక్ లో రూ. లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే.. ఈ రోజు మార్కెట్ విలువ ప్రకారం రూ.23.58 కోట్లు వచ్చి ఉండేవి. ఈ రోజు మార్కెట్లో స్టాక్ రూ.12 వేల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ. 10,727.20 వద్ద ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర 19,325గా ఉంది.

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

పూణేలో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీ కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్‌లు, లైఫ్‌స్టైల్ ఫైనాన్స్, డిజిటల్ ప్రోడక్ట్ ఫైనాన్స్, పర్సనల్ లోన్స్, ప్రాపర్టీపై లోన్, స్మాల్ బిజినెస్ లోన్‌లు, వాలెట్, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లు, టూ-వీలర్, త్రీ-వీలర్ లోన్‌లు, కమర్షియల్ లెండింగ్ వంటి వ్యాపారాలను నిర్వహిస్తోంది. వీటికి తోడు SME రుణాలు, సెక్యూరిటీలపై కూడా కంపెనీ లోన్స్ అందిస్తోంది. మార్చి 2022 సమయానికి కంపెనీ 424.23 లాభాన్ని నమోదు చేసింది. రానున్న కాలంలోనూ ఈ స్టాక్ పెరిగే అవకాశాలు ఉన్నందున దీనిపై ఓ కన్నేసి ఉంచండి.

గమనిక: పైన అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. దీని ఆదారంగా ఎలాంటి ట్రేడింగ్, షేర్ల క్రయవిక్రయాలు చేయకండి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పుకుండా మీ ఆర్థిక సలహాదారును సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+