Bajaj Finance: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బుల్స్ జోరు కొనసాగుతున్న వేళ.. బజాజ్ ఫైనాన్స్ స్టాక్ నేలచూపులు చూసింది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించింది. దీంతో స్టాక్ తీవ్ర ఒత్తిడికి గురైంది. షేర్ విలువ ఏకంగా 4 శాతం వరకు క్షీణింంచింది.
బజాజ్ ఫైనాన్స్ కు సంబంధించిన రెండు లెండింగ్ ఉత్పత్తులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. eCOM మరియు Insta EMI కార్డ్ కింద రుణాల మంజూరును నిలిపివేయాలని కోరింది. వీటిని వెంటనే అమల్లోకి తీసుకురావాలని సూచించడంతో కంపెనీ షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

డిజిటల్ లెండింగ్ గైడ్‌లైన్స్‌లో పేర్కొన్న నిబంధనలను పాటించడంలో బజాజ్ ఫైనాన్స్ విఫలం కావడంతో RBI ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈరోజు ఇంట్రాడేలో స్టాక్ విలువ 4 శాతం మేర పడిపోయి.. 6,937 కనిష్ఠని టచ్ చేసింది. అయితే ప్రస్తుతం మార్కెట్లలో నెలకొన్న బుల్ రన్ వల్ల తిరిగి పుంజుకుంటోంది.
రెండు రుణ ఉత్పత్తులకు సంబంధించిన కీలక వాస్తవాలు రుణగ్రహీతలకు తెలిసేలా ప్రకటనలు జారీ చేయకపోవడం, ఇతర స్టేట్‌మెంట్‌లలో లోపాల కారణంగా నియంత్రణ సంస్థ జోక్యం చేసుకున్నట్లు RBI ఓ ప్రకటనలో పేర్కొంది. గుర్తించిన లోపాలు సరిదిద్దబడిన తర్వాత ఈ పరిమితులను తిరిగి రివ్యూ చేస్తామని స్పష్టం చేసింది. కాగా ఇవాళ మధ్యాహ్నం 1 గంట సమయానికి దాదాపు 1.1 శాతం లాభంతో 7,300 వద్ద స్టాక్ ట్రేడవుతోంది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications