NBFC రంగానికి చెందిన బజాజ్ ఫైనాన్స్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ క్యాప్‌ను అధిగమించింది. మార్కెట్ ముగింపు తర్వాత ఇరు కంపెనీల ఎం-క్యాప్‌లో బజాజ్ ఫైనాన్స్‌ది స్వల్పంగా ఎక్కువ ఉంది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ క్యాప్ రూ.1.76లక్షల కోట్లు ఉండగా, ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.1.71లక్షల కోట్లుగా ఉంది.
ఈ క్రమంలో భారత్‌లో అత్యధిక మార్కెట్ క్యాప్ కలిగిన టాప్ 100 కంపెనీల్లో బజాజ్ ఫైనాన్స్ 12వ స్థానానికి చేరుకుంది. ఎస్బీఐ 13వ స్థానానికి పడిపోయింది. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ, టీసీఎస్ టాప్ టెన్‌లో ఉన్నాయి.

బజాజ్ ఫైనాన్స్ షేరు 2016లో లిస్టయి అదే ఏడాది 40% పెరిగింది. 2017లో 109%, 2018లో 51%, 2019లో 60% ఎగిసింది.లిస్టింగ్ నాటి నుండి ఏకంగా 712% ఎగిసింది. ఇటీవల కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఎన్పీఏలు మరింత పెరగవచ్చునని భావిస్తోంది. దీంతో ఈ ఏఢాది ప్రారంభం నుండి 30 శాతానికి పైగా నష్టపోయింది. జూన్‌లో మాత్రం 51 శాతం ఎగిసింది.


Click it and Unblock the Notifications