బజాజ్ ఫైనాన్స్ గురువారం మార్చి 31, 2024తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. రూ. 3,824.53 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇది క్రితం సంవత్సరం కాలంలో నికర లాభం రూ. 3,157.79 కోట్లుగా ఉంది. అంటే 21 శాతం పెరిగింది. త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 14,926.21 కోట్లుగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ నివేదించిన రూ. 11,364.01 కోట్ల కంటే 31.34 శాతం పెరిగింది.
కంపెనీ ఒక్కో షేరుకు రూ. 36 తుది డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. జనవరి-మార్చి కాలంలో వడ్డీ ఆదాయం రూ. 13,230.08 కోట్లుగా ఉన్నట్లి వివరించింది. అంతకు ముందు ఏడాది కాలంలో ఇది రూ. 9,845.98 కోట్లుగా ఉంది. బుక్ చేసిన కొత్త రుణాల సంఖ్య Q4 FY23లో 75.6 లక్షల నుంచి 24 FY24లో 4% పెరిగి 78.7 లక్షలకు చేరుకుంది.'eCOM', 'lnsta EMI కార్డ్' కింద రుణాల మంజూరు, పంపిణీపై కంపెనీపై ఆర్బీఐ విధించిన పరిమితుల కారణంగా ఈ త్రైమాసికంలో బుక్ చేసిన కొత్త రుణాలు సుమారు 8 లక్షలు తగ్గాయి.

కస్టమర్ ఫ్రాంచైజీ మార్చి 31, 2024 నాటికి 8.36 కోట్లకు చేరుకుంది. మార్చి 31, 2023 నాటికి 6.91 కోట్లుగా ఉంది. ఇది 21% వృద్ధి. Q4FY24లో కంపెనీ కస్టమర్ ఫ్రాంచైజీ 32.3 లక్షలు పెరిగింది. ఏయూఎం మార్చి 31, 2023 నాటికి రూ. 247,379 కోట్ల నుంచి మార్చి 31, 2024 నాటికి రూ. 330,615 కోట్లకు 34% వృద్ధి చెందింది. ఇది Q4 FY24లో ఏయూఎం రూ. 19,647 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం Q4 FY24లో 28% పెరిగి, Q4 FY23లో రూ.6,254 కోట్ల నుంచి రూ.8,013 కోట్లకు పెరిగింది.
నికర మొత్తం ఆదాయం Q4 FY24లో 25% పెరిగి, Q4 FY23లో రూ.7,775 కోట్ల నుండి రూ.9,714 కోట్లకు పెరిగింది. ప్రీ-ప్రొవిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ (PPoP) Q4 FY24లో 25% పెరిగి, Q4FY23లో రూ.5,118 కోట్ల నుండి రూ.6,412 కోట్లకు చేరుకుంది. స్థూల ఎన్పీఏ 0.85 శాతం, నికర ఎన్పీఏ 0.37%గా ఉన్నాయి. మార్చి 31, 2023 నాటికి ఇవి 0.94%, 0.34%గా ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications