For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంస్థ విజయానికి మూడు సూత్రాలన్న బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్.. కరోనాపైన ఆసక్తికర వ్యాఖ్యలు

|

బజాజ్ ఆటో మొబైల్స్ ఎండి రాజీవ్ బజాజ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థ విజయానికి మూడు సూత్రాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎఫ్ ఐ టి ని తమ సంస్థ తు.చ తప్పకుండా పాటిస్తుందని ఆయన పేర్కొన్నారు. మారుతున్న కాలంతో పాటుగా, అంతర్జాతీయ మార్కెట్ ను నిరంతర అధ్యయనం చేస్తూ విభిన్న మోడళ్లను రూపొందిస్తున్నామని ఆయన తెలియజేశారు.

ఎఫ్ఐటి తమ విజయ రహస్యం అన్న రాజీవ్ బజాజ్

ఎఫ్ఐటి తమ విజయ రహస్యం అన్న రాజీవ్ బజాజ్

ఇంతకీ రాజీవ్ బజాజ్ చెప్పిన ఎఫ్ఐటి ఏంటి అంటే ఎఫ్ అంటే ఫోకస్, ఐ అంటే ఐడియా, ఇక టీ అంటే టీమ్ అని అర్థం అని చేసే పని మీద ఫోకస్ చేయడం,మంచి ఐడియాలతో వినియోగదారులకు కావాల్సిన వాటిని అందించడం, టీం వర్క్ చేయడం తమ సంస్థ విజయానికి మూల సూత్రాలుగా రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్లను ఆకర్షించడం కోసం సరికొత్త ఐడియాలను కూడా అధ్యయనం చేస్తున్నట్లు గా ఆయన ప్రకటించారు.

యూరోపియన్ డిజైన్, జపనీస్ నాణ్యత, భారతీయ ధరల ఏకైక ఆటోమొబైల్స్ బజాజ్

యూరోపియన్ డిజైన్, జపనీస్ నాణ్యత, భారతీయ ధరల ఏకైక ఆటోమొబైల్స్ బజాజ్

సిబ్బంది పనితీరు కూడా సంస్థ విజయానికి కారణమవుతుందని అందుకే స్కిల్ ఉన్న సిబ్బందిని నియమించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఇక ఇదే సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ మోటర్ సైకిల్స్ ను తయారు చేయడంలో బజాజ్ చాలా ప్రత్యేకమైన ఆలోచనతో నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.యూరోపియన్ డిజైన్, జపనీస్ నాణ్యత, భారతీయ ధరలను కలిగి ఉన్న ఏకైక ఆటోమొబైల్స్ బజాజ్ అని ఆయన గొప్పగా చెప్పారు.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మోటార్ సైకిల్ తయారీదారుగా గుర్తింపు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మోటార్ సైకిల్ తయారీదారుగా గుర్తింపు

పోటీదారులకు దీటుగా చౌకైన బైక్ తయారు చేసినా, ఖరీదైన బైక్ తయారు చేసినా,అధిక మైలేజ్ ఇచ్చే బైక్ తయారు చేసినా అది బజాజ్ కి సాధ్యమని ఆయన గొప్పగా చెబుతున్నారు. ఇక మోటార్ సైకిళ్ల ప్రపంచంలో మనం చాలా వెనుకబడి ఉన్న సమయంలో ఇండియాలో మోటార్ సైకిల్ వ్యాపారాన్ని నిర్వహించి ప్రపంచ మోటార్ సైకిల్ తయారీదారు గుర్తించబడిన బజాజ్ ను అందరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని బజాజ్ ఆటో ఎండి రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు.

జపాన్, సౌత్ కొరియాలు వైరస్ ను నియంత్రిస్తూనే ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి : రాజీవ్ బజాజ్

జపాన్, సౌత్ కొరియాలు వైరస్ ను నియంత్రిస్తూనే ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి : రాజీవ్ బజాజ్

ఇక కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదని పేర్కొన్న ఆయన కరోనా నియంత్రణకు మనం జపాన్, సౌత్ కొరియా విధానాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జపాన్, సౌత్ కొరియాలు వైరస్ ను నియంత్రిస్తూనే ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నాయని రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోన నియంత్రణ కోసం పశ్చిమ దేశాల నమూనాను అనుసరిస్తోందని, అవి కాకుండా ఆసియా దేశాలైన జపాన్ ,సౌత్ కొరియా విధానాలను అనుసరించాలని అప్పుడే కరోనా వైరస్ ను నియంత్రిస్తూ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పని చేయడం సాధ్యమవుతుందని రాజీవ్ బజాజ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read more about: japan south korea
English summary

సంస్థ విజయానికి మూడు సూత్రాలన్న బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్.. కరోనాపైన ఆసక్తికర వ్యాఖ్యలు | Bajaj Auto MD Rajiv Bajaj said three principles for company success

Bajaj auto MD Rajiv Bajaj said the secret mantra of bajaj auto . he siad It is called FIT: 'f' stands for focus and 'I' stands for idea and 't' stands for team . these three important things make the business stands in the market.
Story first published: Wednesday, June 10, 2020, 18:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X