For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bumper IPO: తొలిరోజే అదరగొట్టిన ఐపీవో.. మూడింతలైన ఇన్వెస్టర్ల డబ్బు.. మీరూ కొన్నారా..

|

Baheti Recycling IPO: దాదాపుగా ఏడాది తర్వాత మళ్లీ దేశంలో ఐపీవోల హవా కొనసాగుతోంది. వరుసగా మార్కెట్లోకి కంపెనీలు లిస్ట్ అయ్యేందుకు క్యూ కట్టడంతో మళ్లీ సందడి నెలకొంది. మార్కెట్లలో ప్రతికూల పవనాలు ఉన్నప్పటికీ కొన్ని ఐపీవోలు వాటిని అధిగమిస్తున్నాయి. తాజాగా ఈరోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయిన కంపెనీ షేర్ ధర ప్రీమియం రేటుకు జాబితా చేయబడింది.

 ఐపీవో వివరాలు..

ఐపీవో వివరాలు..

ఈరోజు మార్కెట్లోకి అడుగుపెట్టిన కంపెనీ బహేతి రీసైక్లింగ్ ఇండస్ట్రీస్. ఇది అల్యూమినియం రీసైక్లింగ్ వ్యాపారంలో నిమగ్నమై ఉంది. లిస్టింగ్ సమయంలోనే ఈ ఎస్ఎమ్ఈ స్టాక్ ఏకంగా 166.67% ప్రీమియంతో ఎన్ఎస్ఈ సూచీలో లిస్ట్ అయి ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను అందించింది. దీంతో షేర్లు ఎలాట్ అయిన పెట్టుబడిదారులు తొలిరోజే ధనవంతులు అయ్యారు.

ఐపీవో దూకుడు..

ఐపీవో దూకుడు..

Baheti Recycling IPO ప్రైస్ బ్యాండ్ రూ.45గా కంపెనీ నిర్ణయించింది. అయితే పెట్టుబడిదారులు షేర్ల కోసం ఎగబడటంతో ఓవర్ సబ్ స్క్రైబ్ అయిన షేర్లు గ్రే మార్కెట్లో మంచి ప్రీమియంను రాబట్టాయి. ఈ క్రమంలో షేర్ ధర లిస్టింగ్ సమయంలో రూ.120కి చేరుకుంది. అలా ఇన్వెస్టర్లు తొలిరోజే ఒక్కో షేరుకు దాదాపుగా రూ.75 లాభాన్ని సొంతం చేసుకున్నారు. అలా షేర్ ధర ఇంట్రాడేలో గరిష్ఠంగా రూ.126ను తాకి చివరికి మార్కెట్ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో రూ.114 వద్ద క్లోజ్ అయింది. అంటే స్టాక్ ముగింపు సమయానికి షేర్ ధర దాదాపు 153.33 శాతం పెరిగింది.

ఐపీవో విశేషాలు..

ఐపీవో విశేషాలు..

అరంగేట్రంలోనే అదరగొట్టిన ఐపీవో రిటైల్ కోటా 435 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ చేయబడింది. మార్కెట్ ఇన్వెస్టర్ల నుంచి ఐపీవో మంచి స్పందనను పొందింది. అందుకే నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల కోటా 259.21 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. కేవలం రూ.12.42 కోట్లను సమీకరించేందుకు కంపెనీ ఒక్కో లాట్ కు 3000 షేర్లతో మార్కెట్లోకి వచ్చింది. సబ్‌స్క్రిప్షన్ కోసం 28 నవంబర్ 2022న తెరవబడిన ఐపీవో నేడు లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుంది.

కంపెనీ వివరాలు..

కంపెనీ వివరాలు..

గుజరాత్ లోని అహ్మదాబాద్ కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న కంపెనీ 1994లో స్థాపించబడింది. కంపెనీ అల్యూమినియం స్క్రాప్, బ్రాస్ స్క్రాప్, కాపర్ స్క్రాప్, జింక్ స్క్రాప్ మొదలైన స్క్రాప్ మెటీరియల్‌ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తోంది. అల్యూమినియం స్క్రాప్‌ను ప్రాసెస్ చేయడానికి 12,000 MT స్థాపిత సామర్థ్యాన్ని ప్రస్తుతం కంపెనీ కలిగి ఉంది. దేశంలోని దాదాపు 12 రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాల్లో కంపెనీ తన ఉత్పత్తులను మార్కెట్ చేస్తూనే.. జపాన్, కెనడా, USA, చైనా, హాంకాంగ్, UAE, తైవాన్ దేశాలకు సైతం ఎగుమతి చేస్తోంది.

English summary

Bumper IPO: తొలిరోజే అదరగొట్టిన ఐపీవో.. మూడింతలైన ఇన్వెస్టర్ల డబ్బు.. మీరూ కొన్నారా.. | BAHETI RECYCLING Ipo bumper listing on day one turned investors rich thrice

BAHETI RECYCLING Ipo bumper listing on day one turned investors rich thrice
Story first published: Thursday, December 8, 2022, 16:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X