Work From Office: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్ పూర్తిగా మారిపోతోంది. చాలా కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగులను తప్పక ఆఫీసులకు తిరిగి రావాల్సిందిగా ఆదేశిస్తున్నాయి. ఇది టెక్ ఉద్యోగులకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవాలి.
ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందిగా చెప్పిన కంపెనీల్లో డెల్, అమెజాన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ముందు వరుసలో నిలిచాయి. చాలా కంపెనీలు ప్రస్తుత వ్యాపార పరిస్థితుల్లో ఫ్రెక్సిబిలిటీ నుంచి ఆఫీసుల నుంచి పనికి మారుతున్నాయి. ఈ క్రమంలో డెల్ కంపెనీ సైతం తన ఉద్యోగులకు ప్రమోషర్లను వర్క్ ఫ్రమ్ ఆఫీసుకు లింక్ చేస్తున్నట్లు ఈమెయిల్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతానికి కొంత మంది ఉద్యోగులకు ఊరటను అందిస్తున్నా రానురాను సౌలభ్యాన్ని నిలిపివేస్తూ కంపెనీలు కఠినంగా వ్యవహరించాలని చూస్తున్నాయి.

చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల తమ డేటా భద్రతపై ఆందోళనను ఇప్పటికే కలిగి ఉన్నాయి. ప్రత్యర్థి కంపెనీలకు తమ ప్రాజెక్టుల వివరాలు, అంతర్గత సీక్రెట్లు తెలుస్తాయనే ఆందోళనలోనూ ఉన్నందున ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందిగా ఆదేశిస్తున్నాయి. తమ పాలసీలు ఇష్టం లేకుంటే నిరభ్యంతరంగా ఉద్యోగం మానేయవచ్చని కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులకు తేల్చి చెప్పన సంఘటనలు చాలా సార్లు వార్తల్లో వినిపించాయి.
ఇప్పుడు అసలు ప్రమాదం ఏమిటంటే.. టెక్ రంగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి బ్యాడ్ న్యూస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుదల టెక్ రంగంలోని ఉద్యోగ అన్వేషకులను ప్రభావితం చేస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా ఏఐపై పట్టు నైపుణ్యం ఉన్న వారికి బలమైన డిమాండ్ ఉంది. అలాంటి నైపుణ్యాలు ఉన్నవారికే అధిక వేతనాలు చెల్లించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇకపై ఏఐ జ్ఞానం లేని టెక్ ఉద్యోగుల వేతనాలు గతం కంటే తగ్గనున్నట్లు ఇది సూచిస్తుంది.
IT నిరుద్యోగిత రేటు ఫిబ్రవరిలో 4.3%, మొత్తం US రేటు 3.9% కంటే ఎక్కువగా ఉందని కన్సల్టింగ్ సంస్థ జాన్కో తెలిపింది. 2024లో అమెరికా జాబ్ మార్కెట్లో ఏఐ వినియోగం, ఆటోమేషన్ వంటి కారణాలతో 20 వేల నుంచి 30 వేల మధ్య టెక్ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోనున్నాయనే అంచనాలు సంచలనంగా మారాయి.


Click it and Unblock the Notifications