IT News: ప్రస్తుతం జాబ్ మార్కెట్లు చాలా దీన స్థితిలో ఉన్నాయి. కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలు ఊడిపోకుండా ఉంటే చాలు దేవుడా అని చాలా మంది అనుకుంటున్నారు. ప్రతి నెల వారికి ఒక గండంలా మారిపోయింది.
ఈ క్రమంలో ఎక్కువ మంది ఐటీ రంగంలో విద్యను పూర్తి చేసి చేస్తే సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలనుకునే యువతకు అతిపెద్ద బ్యాడ్ న్యూస్ స్వాగతం పలుకుతోంది. అవును క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కోసం ఎదురుచూస్తున్న ఐటీ విద్యార్థులకు నిరాశ కలిగించే వార్త. ప్రాజెక్టులు లేక ఉన్న ఉద్యోగులనే బెంచ్ పై చాలా టెక్ కంపెనీలు కొనసాగిస్తున్న వేళ నియామకాలను దాదాపు నిలిపివేశాయి. అవసరమైన ఏఐ వంటి సాంకేతికతలను ఉన్నవారికే నేర్పించి ఖర్చులను తగ్గించుకుంటున్నాయి.

జూన్ త్రైమాసికంలో ఉద్యోగాలు సృష్టించిన ఏకైక టాప్ టెక్ కంపెనీగా టీసీఎస్ నిలిచింది. అది కూడా కేవలం 523 మందిని మాత్రమే నియమించుకుంది. ఇది కాకుండా జూన్ త్రైమాసికంలో దేశంలోని నాలుగు పెద్ద ఐటీ కంపెనీల్లో మొత్తం 18,000 మందిని తొలగింపులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ 6,940, విప్రోలో 8,812, హెచ్‌సీఎల్ 2,506 క్షీణత నమోదైంది. ఇదే క్రమంలో క్యూ4 FY23లో యాక్సెంచర్ 951 మందిని జోడించింది. దీనికి తోడు ఇటీవల యాక్సెంచర్ భారత టెక్ కంపెనీల మందగమనంపై చేసిన ప్రకటన అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు విచక్షణతో కూడిన వ్యయాలు చేస్తున్న తరుణంలో భారత ఐటీ సేవల కంపెనీలకు ప్రాజెక్టులు తగ్గిపోయాయని గ్రోత్ అడ్వైజరీ సంస్థ క్యాట్‌లింక్స్ భాగస్వామి రామ్‌కుమార్ రామమూర్తి అన్నారు. దీంతో కంపెనీలు నియామకాలను సైతం గణనీయంగా తగ్గించాయి. ఇదే ధోరణి మరికొన్ని నెలల పాటు కొనసాగుతుందని అమెరికా ప్రఖ్యాత బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గన్ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. బలహీనమైన డిమాండ్ వాతావరణం STEM క్యాంపస్‌ల నుంచి నియామకంపై కూడా ప్రభావం చూపుతుందని అన్నారు. ఇప్పటికే కొన్ని పెద్ద కంపెనీలు క్యాంపస్‌లకు దూరంగా ఉండటం, ఆన్‌బోర్డింగ్ ఆలస్యం చేయడం వంటివి ఆచరిస్తున్నాయి.


Click it and Unblock the Notifications