Gold Rate Today: దాదాపు రెండు వారాలుగా వరుసగా బంగారం ధరలు దేశంలో క్షీణిస్తూనే ఉన్నాయి. అయితే నేడు రేట్లు పెరగటం తిరిగి ప్రారంభం కావటంతో కొనుగోలు దారులు షాక్ అయ్యారు. రేటు ఇంకా తగ్గుతుందని వేచి చూసిన వారు ఖంగుతిన్నారు.
22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.100 పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.52,850, ముంబైలో రూ.52,500, దిల్లీలో రూ.52,650, కలకత్తాలో రూ.52,500, బెంగళూరులో రూ.52,500, కేరళలో రూ.52,500, వడోదరలో రూ.52,550, పూణేలో రూ.52,500, జైపూర్‌లో రూ.52,650, కోయంబత్తూరులో రూ.52,850, నాగపూర్‌లో రూ.52,500, నాశిక్‌లో రూ.52,530, బళ్లారిలో రూ.52,500, గురుగ్రామ్‌లో రూ.52,650 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు నేడు రూ.70 రూపాయలు పెరిగాయి. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.57,650, ముంబైలో రూ.57,230, దిల్లీలో రూ.57,380, కలకత్తాలో రూ.57,230, బెంగళూరులో రూ.57,230, కేరళలో రూ.57,230, వడోదరలో రూ.57,280, పూణేలో రూ.57,230, జైపూర్‌లో రూ.57,380, కోయంబత్తూరులో రూ.57,380, నాగపూర్‌లో రూ.57,230, నాశిక్‌లో రూ.57,260, బళ్లారిలో రూ.57,230, గురుగ్రామ్‌లో రూ.57,380గా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణ నగరాలైన విజయవాడ, అనంతపురం, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, విశాఖ, కడప, గుంటూరు, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,500, 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,230 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.500 తగ్గటంతో రిటైల్ మార్కెట్లో రూ.73,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications