IT News: టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, టెక్ మహీంద్రా ఇన్వెస్టర్లకు అలర్ట్..!
Investments: గడచిన ఏడాది కాలంగా అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఐటీ సేవల రంగంలో పెను భూకంపాన్ని సృష్టించింది. ఈ రంగంలో ఉపాధి పొందుతున్న లక్షల మంది ప్రత్యక్షంగా.. కోట్ల మంది పరోక్షంగా ప్రభావితం అవుతున్నారు.
ఈ క్రమంలో దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీల్లో సైతం మందగమనం ఆవరించింది. చాలా కంపెనీలు కొత్త ప్రాజెక్టులు లేక మార్జిన్ల ఒత్తిడిని ఎదుర్కొంటుండగా.. మరో పక్క వాటికి ఉన్న పాత ప్రాజెక్టులు సైతం చేజారిపోతున్నాయి. దీంతో కంపెనీలు కొత్త రిక్రూట్మెంట్లను దాదాపుగా నిలిపివేశాయి. ఉన్న టెక్కీలను ఎలా తగ్గించాలా అని ఆలోచిస్తున్నాయి. పైగా వేల మంది ప్రాజెక్టులు లేక కొత్త అవకాశాలు రాక బెంచ్ పై బిక్కుబిక్కుమంటూ ఉద్యోగాల వేట కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టినవారిలో సైతం గుబులు మెుదలైంది. దేశంలోని ఈ ఐదు అగ్రశ్రేణి టెక్ కంపెనీల ఈక్విటీ షేర్లకు ఎర్నింగ్ ఫర్ షేర్ గత 12 నెలల కాలంలో 4-27 శాతం తగ్గటం చాలా మందిలో ఆందోళనలు కలిగిస్తోంది. ప్రస్తుత డౌన్‌గ్రేడ్ సైకిల్ ప్రారంభంలో ఉన్న అధిక అంచనాలు, ఇప్పటికే అంతర్నిర్మిత రికవరీ ఆశల కారణంగా.. ప్రస్తుత 12 నెలల ఫార్వర్డ్ ఎర్నింగ్ వృద్ధి అంచనాలు గత ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్ల కంటే ఎక్కువగా 11-55 శాతం వద్ద ఉన్నాయని JM ఫైనాన్షియల్ తెలిపింది.
దీనికి తోడు ప్రస్తుత ఆదాయ వృద్ధి గత సంవత్సరం ఫార్వార్డ్ అంచనాల కంటే చాలా తక్కువగా ఉంది. ఇది టీసీఎస్, విప్రోలకు 2013-17 కాలం మాదిరిగానే కనిపిస్తోందని, నిరంతర ప్రతికూల ఆదాయాలు ఆశ్చర్యకరంగా తక్కువ స్టాక్ రిటర్న్‌కి దారితీసిందని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. ఇన్ఫోసిస్ ఎర్నింగ్ పర్ షేర్ 12 నెలల ఫార్వర్డ్ ఎర్నింగ్స్ వృద్ధి అంచనా ప్రస్తుతం 11 శాతంగా ఉందని జేఎం ఫైనాన్షియల్ తెలిపింది.
ఇది పెద్ద-డీల్ లీడ్ గ్రోత్ యాక్సిలరేషన్‌పై స్ట్రీట్ అంచనాలపై ఆధారపడి ఉందని పేర్కొంది. టీసీఎస్ విషయంలోనూ అంచనా ఇంతే ఉండగా.. విప్రో వాస్తవ ఆదాయ వృద్ధి పథం మారినట్లు కనిపిస్తోంది. ఈ ప్రతికూలతలు 2025 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడిదారులకు పెద్ద రిటర్న్ అందించటంలో నిరాశ పరచొచ్చని అంచనాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications