బ్యాంకులకు మొండి బాకీలు పెరిగిపోతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో బ్యాండ్ బ్యాంక్ ఏర్పాటు తప్పనిసరి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు తప్పనిసరి మాత్రమే కాదని, అనివార్యం కూడా అన్నారు. కరోనా సంక్షోభంతో బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఏల సమస్య నుండి గట్టెక్కేందుకు పబ్లిక్ సెక్టార్ అసెట్స్ రిహాబిలిటేషన్ ఏజెన్సీ(PARA) పేరుతో బ్యాడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేయాలని 2017 ఎకనమిక్ సర్వే కూడా సూచించింది.

బ్యాడ్ బ్యాంక్ కోసం ఆ విధానాలు..
బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుతో మొండి బకాయిల పరిష్కారంలో పరస్పర ప్రయోజన వివాదాలు, అవినీతిని నివారించవచ్చునని సుబ్బారావు తెలిపారు. బ్యాడ్ బ్యాంక్స్ కొన్ని విజయవంతమయ్యాయని, ఇందుకు ధనహర్తా ఆఫ్ మలేషియా మంచి ఉదాహరణ అన్నారు. దీని విధివిధానాలను మన వద్ద బ్యాడ్ బ్యాంక్ కోసం తీసుకోవచ్చునని చెప్పారు. దీనిపై అధ్యయనం చేయాలన్నారు. సాధారణ బ్యాంకులతో పోలిస్తే మొండి బకాయిల విషయంలో బ్యాడ్ బ్యాంకులు త్వరితగతిగా, క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయన్నారు.

ఇదీ బ్యాడ్ బ్యాంక్
వివిధ బ్యాంకుల్లోని మొండి బాకీల ఖాతాలను అన్నింటిని ఒక సంస్థకు బదలీ చేసి వెంటనే ఆ ఖాతాలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలనే వాదన ఎప్పటి నుండో ఉంది. ఇలాంటి సంస్థనే బ్యాడ్ బ్యాంక్ అని వ్యవహరిస్తున్నారు. సాంకేతికంగా బ్యాడ్ బ్యాంకును రుణ పునర్వ్యవస్థీకరణ కంపెనీగా పిలుస్తారు. వాణిజ్య బ్యాంకుల నుండి రాయితీపై ఎన్పీఏలను ఈ బ్యాడ్ బ్యాంకు కొనుగోలు చేస్తుంది. ఆ తర్వాత సదరు రుణగ్రహీతల నుండి నిర్ణీత సమయంలో వసూలు చేసుకుంటుంది.

వృద్ధి రేటు పతనం
మన దేశంలో వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో బాగా పతనమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మొండి బాకీలు భారీగా పెరిగిపోతున్నట్లు చెప్పారు దువ్వూరి సుబ్బారావు. 2020 మార్చి నాటికి దేశీయంగా బ్యాంకులకు మొండి బాకీలు 8.5 శాతం ఉండగా, వచ్చే ఏడాది మార్చినాటికి 12.5శాతానికి పెరిగే అవకాశముందని ఆర్బీఐ నివేదిక పెరిగింది.

ఆ భారం మోయలేదు.. బ్యాడ్ బ్యాంక్‌పై దృక్పథం మారింది
ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(IBC) ద్వారా మొండి బకయిల సమస్ పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం లేదని డీ సుబ్బారావు చెప్పారు. ఇప్పటికే IBC వ్యవస్థ మీద మోయలేనంత పనిభారం ఉందన్నారు. ఈ వ్యవస్థ ఎన్పీఏల అదనపు భారాన్ని మోయలేదన్నారు. బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుకు సంబంధించి గతంలో తనకు కొన్ని అభ్యంతరాలు ఉండేవని, ఇటీవలి కాలంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ బ్యాంక్ ఏర్పాటుపై తన దృక్పథం మారిందన్నారు. దివాలా చట్టంతో ఎన్పీఏల పరిష్కారం గాడిన పడుతుందని భావించినప్పటికీ, క్రమంగా విశ్వాసం సన్నగిల్లినట్లు చెప్పారు. బ్యాంకులు తమ అవసరాలకు తగినంత మూలధనాన్ని సమకూర్చుకోవడం కూడా సమస్యేనని సుబ్బారావు అన్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications