బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారానికి సంబంధించి బ్యాడ్ బ్యాంకు ఏర్పాటులో కీలక అడుగు. ఇందుకోసం ఏర్పాటు చేయనున్న NARCL లేదా బ్యాడ్ బ్యాంకు జారీ చేసే సెక్యూరిటీ రసీదులకు ప్రభుత్వం హామీ ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తెలిపారు. మొత్తం రూ.30,600 కోట్ల విలువైన రసీదులకు ప్రభుత్వ హామీ ఉంటుంది. అయిదేళ్ల పాటు ఇది కొనసాగుతుందన్నారు. ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంకు 15 శాతం రుణాలకు నగదు రూపంలో చెల్లించనుండగా, మిగిలిన 85 శాతం ప్రభుత్వ హామీ కలిగిన సెక్యూరిటీ రసీదులను జారీ చేస్తుందని నిర్మలమ్మ తెలిపారు.

2018 తర్వాతే రూ.3.1 లక్షల కోట్ల వసూళ్లు
బ్యాంకులు గత ఆరేళ్ల కాలంలో రూ.5.01 లక్షల కోట్ల అన్-పెయిడ్ లోన్స్‌ను రికవరీ చేశాయని, ఇందులో రూ.3.1 లక్షల కోట్లు మార్చి 2018 నుండి రికవరీ అయ్యాయని నిర్మలమ్మ తెలిపారు. కేంద్ర కేబినెట్ నిన్న రూ.30,600 కోట్ల సెంట్రల్ గవర్నమెంట్ గ్యారెంటీని అప్రూవ్ చేసింది. 2015లో అసెట్ క్వాలిటీ రివ్యూ మీటింగ్ జరిగింది. 2018లో 21 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో రెండు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. 2021 నాటికి కేవలం రెండు బ్యాంకులు మాత్రమే నష్టాలను నమోదు చేశాయన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం 4G స్ట్రాటెజీతో ముందుకు వచ్చిందని, రికగ్నైజేషన్, రిసొల్యూషన్, రీక్యాపిటలైజేషన్, రీఫామ్స్ అని తెలిపారు.

4G ప్రణాళిక
రికగ్నైజేషన్ (గుర్తింపు) తర్వాత ఎన్పీఏల క్వాటింటీని గుర్తించామని, ఆ తర్వాత రికవరీకి బ్యాంకులు కసరత్తు చేశాయని తెలిపారు. అలాగే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. NARCLలో PSBs వాటా 51 శాతం, అలాగే, ప్రయివేటు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషనస్ వాటా గరిష్టంగా 49 శాతంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ గ్యారెంటీ అయిదేళ్లు. అన్ని బ్యాడ్ రుణాలు కూడా NARCL కిందకు తీసుకు వస్తారు. వీటిని అయిదేళ్లలో పరిష్కరిస్తారు.

అందుకే రుణ వసూళ్లు
తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల ద్వారా రుణాల వసూళ్లు పెరిగాయని నిర్మలమ్మ తెలిపారు. 4G ప్రణాళికతో గత 6 ఆర్థిక సంవత్సరాల్లో రూ.5,01,479 కోట్ల మేర రుణాలు వసూలయ్యాయన్నారు. దేశీయ బ్యాంకులు కొన్ని ఏళ్లుగా ఎన్పీఏల సమస్య ఎదుర్కొంటున్నాయి. 2022 నాటికి ఈ ఎన్పీఏల వ్యాల్యూ రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుందనే అభిప్రాయల నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ఈ బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు గురించి నిర్మలమ్మ ప్రకటించారు.
FY22 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి బ్యాంకుల బ్యాడ్ లోన్స్ రూ.10 లక్షల కోట్లు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ బాడీ అసోచామ్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ సంయుక్త స్టడీలో వెల్లడైంది. మార్చి 2022 నాటికి ఎన్పీఏలు 8.5 శాతం నుండి 9 శాతానికి చేరుకోవచ్చునని భావిస్తున్నారని, రిటైల్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజ్(MSME) అకౌంట్స్ స్లిప్పేజ్ కారణంగా కొన్ని పునర్నిర్మించిన ఆస్తులు ఉన్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. బ్యాంకులకు మొండి బకాయిలు గుదిబండలా మారుతున్నాయి. రిటైల్, ఎంఎస్ఎంఈ రంగాల్లో నిరర్థక ఆస్తులు అంతకంతకు పెరగడంతో వచ్చే మార్చి నాటికి ప్రధాన బ్యాంకుల ఎన్పీఏలు రూ.10 లక్షల కోట్లు దాటవచ్చునని చెబుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications