Baby Movie collections: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న బేబీ సినిమా..

చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో నడుస్తోంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మంచి ఆదారణ పొందింది. బేబీ సినిమా చాలా బాగుందని అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ప్రశంసలు కురిపించారు. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం భారీ బడ్జెట్ సినిమాలాగా కలెక్షన్లు రాబడుతోంది.

దాదాపు రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.50 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.44.06 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 36.90 కోట్లు రాబట్టింది. ఏడో రోజు బేబీ మూవీ వసూళ్లు కాస్త తగ్గాయి. అయినపప్పటికీ చాలా థియేటర్లలో సినిమా ప్రదర్శనలో ఉంది. బేబీ సినిమా మొదటి రోజు రూ. 6.55 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు రూ.6.75 కోట్లు, మూడో రోజు రూ.7.90 కోట్లు, నాలుగో రోజు రూ. 7.40 కోట్లు వసూలు చేసింది.

 Baby movie is raining collections at the box office

ఐదో రోజు రూ.6.30 కోట్లు వసూలు చేయగా.. ఆరో రోజు రూ.5.50 కోట్లు, ఏడో రోజు రూ.4.20 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం బయ్యర్లు, ఎగ్జిబిటర్లు లాభాల్లో ఉన్నారు. ఈ సినిమాకు ఎస్కోఎన్ నిర్మాతగా ఉన్నారు. సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. 2023లో సినిమా విడుదల రోజు అత్యధికంగా వసూళ్లు చేసిన సినిమాల్లో బేబీ మూవీ 10వ స్థానంలో ఉంది.

ఈ సినిమా కంటే ముందు ఆదిపురుష్(తెలుగు, హిందీ,తమిళం, మలయాళం) రూ.140 కోట్లు, వీరసింహారెడ్డి రూ.50.1 కోట్లు, వాల్తేర్ వీరయ్య రూ.49.1 కోట్లు, దసరా రూ.38.4 కోట్లు, విరూపాక్ష రూ.11.85 కోట్లు, గూఢచారిృ రూ.10.45 కోట్లు, దాస్ కీ ధామ్కీ రూ.8.88 కోట్లు, ఏజెంట్ రూ.8.6 కోట్లు, రావణాసురుడు రూ.8.5 కోట్లు వసూలు చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+