గ్రహాంతర వాసులు.. మనుషులపై ఏఐ దాడి..! బాబా వంగా భవిష్యవాణి తెలిస్తే ఇక నిద్ర పోరు!
ప్రతి ఏడాది ముగిసే సమయానికి సోషల్ మీడియాలో, టిక్‌టాక్‌లో ఒక పేరు మారుమోగిపోతుంటుంది.. అదే బాబా వంగా (Baba Vanga). బల్గేరియాకు చెందిన ఈ అంధురాలైన ప్రవక్త మరణించి దశాబ్దాలు గడుస్తున్నా.. ఆమె చేసినట్లుగా చెబుతున్న అంచనాలు ఇప్పటికీ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఆమె చేసినట్టు ప్రచారం అవుతున్న 2026 భవిష్యవాణి ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

ఎవరీ బాబా వంగా?
బాబా వంగా ఒక బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త. ఆమె 1996లో మరణించారు. అయితే ఆమెకు భవిష్యత్తును చూసే అద్భుత శక్తి ఉందని ప్రజలు నమ్మేవారు. అందుకే ఆమెను "బాల్కన్ నోస్ట్రడామస్" అని పిలుస్తారు. రాజకీయ దిగ్గజాలు సైతం ఆమె సలహాల కోసం క్యూ కట్టేవారట.
2026 లో జరగబోయే మార్పులు ఇవే!
బాబా వంగా.. గతంలో సెప్టెంబర్ 11 దాడులు, సోవియట్ యూనియన్ పతనం వంటివి ముందే ఊహించారని నమ్మేవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు 2026 సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో.. ఆమె పేరుతో కొన్ని భయంకరమైన అంచనాలు వైరల్ అవుతున్నాయి. అవేంటంటే..
1. భూమిపైకి గ్రహాంతరవాసులు (Aliens)
ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అత్యంత వేగంగా వైరల్ అవుతున్న అంచనా ఇది. 2026లో భూమిపైకి గ్రహాంతరవాసులు వస్తారని ఆమె ఊహించినట్లు సమాచారం. ముఖ్యంగా 3I/ATLAS అనే ఒక భారీ ఖగోళ వస్తువు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని, అది కేవలం గ్రహశకలం కాదని గ్రహాంతరవాసుల నౌక కావచ్చని సోషల్ మీడియా సిద్ధాంతాలు చెబుతున్నాయి. ఇది నవంబర్ 2026 లో జరగవచ్చని అంచనా.
2. ఏఐ (AI) ఆధిపత్యం - మనిషి మనుగడకు ముప్పు
ఆమె తన కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనే పేరు వాడకపోయినా, టెక్నాలజీ మనుషుల నియంత్రణ దాటిపోతుందని ఆమె హెచ్చరించినట్లు చెబుతారు. మనుషులు యంత్రాలపై అతిగా ఆధారపడటం వల్ల మానవ మేధస్సు కంటే ఏఐ వేగంగా ఎదగడం, ఉద్యోగాల కోత, నైతిక విలువలు పడిపోవడం వంటివి 2026 లో తీవ్రం కాబోతున్నాయట.
3. భీకరమైన ప్రకృతి వైపరీత్యాలు
వాతావరణ మార్పుల వల్ల 2026 లో భారీ భూకంపాలు, సునామీలు మరియు తీవ్రమైన వడగాల్పులు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తాయని బాబా వంగా హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సైంటిస్టులు ఇస్తున్న హెచ్చరికలకు ఇది దగ్గరగా ఉండటంతో ప్రజల్లో భయం మొదలైంది.
4. ప్రపంచ యుద్ధ మేఘాలు
2026 లో యూరప్ మరియు ఆసియా దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయని, ఇది ప్రపంచ ముఖచిత్రాన్నే మార్చేస్తుందని అంచనా. ముఖ్యంగా తైవాన్, దక్షిణ చైనా సముద్రం, భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు పెరగవచ్చని వైరల్ థియరీలు పేర్కొంటున్నాయి.
5. రష్యా లీడర్ హవా
రష్యాకు చెందిన ఒక నాయకుడు "ప్రపంచ అధినేత"గా ఎదుగుతారని ఆమె చెప్పినట్లు సమాచారం. ఈ అంచనా నేటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉద్దేశించి చేసినదా? లేక మరెవరైనా కొత్త నాయకుడు పుట్టుకొస్తారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
వీటిలో నిజమెంత?
బాబా వంగా తన అంచనాలను ఎక్కడా రాతపూర్వకంగా రాయలేదు. ఆమె చెప్పిన మాటలను విన్నవారు, తర్వాత కాలంలో వాటిని ఇంటర్నెట్‌లో ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంత నిజముందో కాలమే నిర్ణయించాలి. కానీ, ఆమె పేరు మీద జరుగుతున్న ఈ ప్రచారం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రతిసారీ చర్చనీయాంశంగా మారుతోంది.


Click it and Unblock the Notifications