2026లో ప్రకృతి విలయతాండవం.. కరువుతో జనాలు విలవిల.. వణికిస్తున్న బాబా వంగా తాజా ప్రవచనాలు..
బల్గేరియాకు చెందిన ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త బాబా వంగా పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మందికి ఆశ్చర్యంతో పాటుగా ఆసక్తి, కొంత భయం కూడా కలుగుతాయి. చూపు కోల్పోయినప్పటికీ, ఆమె చెప్పినట్లుగా భావించే ప్రవచనాలు ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యాయి. 1996లో ఆమె మరణించినా, ఆమె చెప్పిన అంచనాలు మాత్రం నేటికీ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించిన సంక్షోభ కాలాల్లో.. Baba Vanga చెప్పిన ప్రవచనాలు ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉంటాయి.
ఇటీవల 2026 సంవత్సరానికి సంబంధించి Baba Vanga చెప్పిన ప్రవచనాలు మళ్లీ సోషల్ మీడియా విపరీతమైన చర్చకు దారి తీస్తున్నాయి. ఈ అంచనాలు ప్రకృతి, రాజకీయాలు, మానవ భవిష్యత్తు మాత్రమే కాకుండా... ఏకంగా గ్రహాంతర జీవుల వరకు విస్తరించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ విన్నప్పుడు కొందరికి ఇవి ఊహాగానాల్లా అనిపిస్తుంటాయి. మరికొందరు మాత్రం గతంలో నిజమైనట్లుగా చెప్పబడిన ప్రవచనాలను గుర్తు చేసుకుని వీటిని హెచ్చరికలుగా భావిస్తుంటారు.

2026లో ప్రకృతి విపత్తుల హెచ్చరిక: బాబా వంగా అంచనాల ప్రకారం.. 2026 సంవత్సరం ప్రపంచానికి తీవ్రమైన ప్రకృతి ప్రకోపంలా మారవచ్చని చెబుతారు. భారీ భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, అతి తీవ్ర వాతావరణ మార్పులు ఈ కాలంలో చోటుచేసుకునే అవకాశం ఉందని ఆమె అంచనా వేసిందని నమ్ముతారు. ఈ విపత్తులు ఒక్కో దేశానికే పరిమితం కాకుండా, విస్తృత ప్రాంతాలను ప్రభావితం చేస్తాయని ఆమె అంచనా వేసింది. అయితే చాలా మంది నిపుణులు ఈ అంచనాలను పర్యావరణ అసమతుల్యతపై ఒక హెచ్చరికగా భావించాలని సూచిస్తున్నారు.
ప్రపంచ ఉద్రికత్తలపై ఆందోళన: బాబా వంగా చెప్పిన అత్యంత భయానక ప్రవచనాలలో ఒకటి ప్రపంచవ్యాప్త సంఘర్షణకు సంబంధించినది. కొన్ని సూచలన ప్రకారం, ఆమె మూడవ ప్రపంచ యుద్ధం వంటి పరిస్థితులను సూచించిందని చెబుతున్నారు. ముఖ్యంగా పెద్ద దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, రాజకీయ అస్థిరత, ఆయుధ పోటీ వంటి అంశాలు ఈ భయాలకు ప్రధాన కారణమవుతున్నాయి. మధ్యప్రాచ్యం, దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ శాంతికి ముప్పుగా మారవచ్చని ఈ ప్రవచనాలు సూచిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.
గ్రహాంతర జీవులతో మమేకం: 2026 అంచనాల్లో అత్యంత సంచలనాత్మకమైనది ఏలియన్స్‌కు సంబంధించిన ప్రవచనం. మానవ చరిత్రలో తొలిసారిగా గ్రహాంతర జీవులతో ప్రత్యక్ష సంబంధం ఏర్పడే అవకాశం ఉందని బాబా వంగా సూచించిందని కొన్ని కథనాలు చెబుతున్నాయి. భూమి వాతావరణంలోకి ఒక భారీ అంతరిక్ష నౌక ప్రవేశించవచ్చని.. దీని ద్వారా మానవేతర జీవుల ఉనికి స్పష్టమవుతుందని అంటున్నారు. అయితే, శాస్త్రీయంగా ఇవి ఇప్పటికీ నిర్ధారణ కాని ఊహాగానాలే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇది భయమా? లేక హెచ్చరికా: బాబా వంగా అంచనాలను భయపడేందుకు కాకుండా.. మన భవిష్యత్తును ఆలోచించేందుకు ఇచ్చిన సంకేతాలుగా చూడాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రకృతి సంరక్షణ, ప్రపంచ శాంతి, మానవ విలువలు.. ఇవన్నీ కాపాడుకుంటేనే భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందన్న సందేశమే ఆమె ప్రవచనాల సారాంశమని అనేవారూ కూడా ఉన్నారు. ఏదేమైనా 2026 ఎలా ఉండబోతుందో కాలమే చెప్పాలి. అయితే బాబా వంగా పేరు మాత్రం భవిష్యత్తుపై చర్చలు జరిగిన ప్రతిసారి తప్పనిసరిగా వినిపిస్తూనే ఉంటుంది. సో వెయిట్ అండ్ సీ..
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications