Gold: బాబా వంగా సంచలన జోస్యం! ఈ ఏడాది బంగారం, వెండి మాత్రమే రక్షిస్తాయా?
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఆర్థిక పరిణామాలు చూస్తుంటే.. బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ అంధురాలు, ఆధ్యాత్మిక వేత్త బాబా వంగా గతంలో చెప్పిన మాటలు నిజమవుతాయా? అనే అనుమానం కలగక మానదు. 2026వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఆర్థిక సంక్షోభం వస్తుందని ఆమె ఎప్పుడో జోస్యం చెప్పారు. ముఖ్యంగా నగదు కొరత కారణంగా ప్రపంచ ద్రవ్య వ్యవస్థలు కుప్పకూలుతాయని, ఆ సమయంలో కేవలం బంగారం (Gold), వెండి (Silver) , రాగి (Copper) మాత్రమే సురక్షితమైన పెట్టుబడులుగా నిలుస్తాయని ఆమె అంచనా వేశారు.

బంగారం ధర రూ. 2.40 లక్షలు దాటుతుందా?
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ట్రెండ్స్ చూస్తుంటే బాబా వంగా అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. 2025 నుండి ఇప్పటివరకు గోల్డ్ ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 1.69 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరో 25 నుండి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే.. 2026 నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 2.11 లక్షల నుండి రూ. 2.43 లక్షల వరకు చేరుకోవచ్చు. ఇది చరిత్రలోనే ఆల్-టైమ్ గరిష్ట స్థాయి అవుతుంది.
పెరుగుతున్న డిమాండ్ , సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు
కేవలం బాబా వంగా మాటలే కాదు, వాస్తవ గణాంకాలు కూడా బంగారానికి ఉన్న డిమాండ్‌ను స్పష్టం చేస్తున్నాయి. భారత దేశం ప్రతి ఏటా 100 టన్నుల కంటే ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు కూడా తమ నిల్వలను పెంచుకుంటున్నాయి. దీపావళి 2026 నాటికి ఈటిఎఫ్ (ETF) పెట్టుబడులు కూడా పెరిగి, బంగారం ధర రూ. 1.62 లక్షల నుండి రూ. 1.82 లక్షల మధ్య స్థిరంగా ఉండవచ్చని అంచనా.
వెండి, రాగి పరిస్థితి ఏమిటి?
బాబా వంగా జోస్యం ప్రకారం, వెండి , రాగి కూడా సంక్షోభ సమయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటికే వెండి ధరలు కేజీకి రూ. 1.25 లక్షల వద్ద ఉన్నాయి. గత వారం వెండి ధరలు ఏకంగా 9 శాతం పెరిగి రూ. 4.20 లక్షల మార్కును తాకిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి వెండి ధర రూ. 3.99 లక్షల వద్ద స్థిరంగా ఉంది. అలాగే బంగారం ధరలు (Gold rates) కూడా ఒక దశలో రూ. 1.80 లక్షలు తాకి ప్రస్తుతం రూ. 1.69 లక్షల వద్ద ఉన్నాయి.
మొత్తంగా చూస్తే.. గతంలో చెర్నోబిల్ విపత్తు వంటి ఎన్నో విషయాలను బాబా వంగా కచ్చితంగా అంచనా వేశారు. ఇప్పుడు 2026 ఆర్థిక సంక్షోభం, నగదు కొరత గురించి ఆమె హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఆర్థిక అస్థిరత ఉన్న సమయంలో బంగారం, వెండి వంటి లోహాలు ఇన్వెస్టర్లకు ఎప్పుడూ రక్షణగా నిలుస్తాయి. పెట్టుబడిదారులు మార్కెట్ హెచ్చుతగ్గులను గమనిస్తూ జాగ్రత్తగా ముందడుగు వేయడం ఉత్తమం.


Click it and Unblock the Notifications