Patanjali News: దేశంలో అనేక ఆయుర్వేద ఉత్పత్తులతో పాటు ఎఫ్ఎంసీజీ రంగంలో బలమైన మార్కెట్ కలిగిఉన్న కంపెనీ పతంజలి. దీనిని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ స్థాపించారు.
అయితే ఇప్పుడు పతంజలి తన వ్యాపారాలను సాంకేతిక రంగంలోకి విస్తరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పతంజలి అప్పుల ఒప్పందంలో కూరుకుపోయిన రోల్డా ఇండియా సంస్థను రూ.830 కోట్ల నగదు ఒప్పందంతో సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చింది. పూణేకు చెందిన అష్టన్ ప్రాపర్టీస్‌కు గత వారాంతంలో రోల్డా ఇండియా వేలంపాటలో కంపెనీకి రుణాలు ఇచ్చిన బ్యాంకులు నిర్వహించిన వేలంలో అధిక ధరను తొలుత బిడ్ చేసింది. అయితే పతంజలి దీనికి మించిన మెుత్తాన్ని ఆఫర్ చేస్తూ ఎన్సీఎల్టీని సంప్రదించింది.

రోల్డా ఇండియా అనేది 1989లో స్థాపించబడిన కమల్ సింగ్ నేతృత్వంలోని సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ కంపెనీ. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ఐటీ, బిజినెస్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్, జియోగ్రాఫిక్ డేటా, ఇన్ఫర్మేషన్ అండ్ ఇంజినీరింగ్ విభాగాల్లో సేవలను అందిస్తోంది. అయితే కంపెనీ 2023 జనవరిలో దివాలా తీసినట్లు ప్రకటించబడింది. ఆ సమయంలో యూనియన్ బ్యాంక్ కన్సార్టియం రూ.7,100 కోట్లు, సిటీ గ్రూప్ నేతృత్వంలోని అసురక్షిత విదేశీ బాండ్ హోల్డర్‌లకు రూ.6,699 కోట్ల రుణాన్ని చెల్లించాల్సి ఉంది. మొత్తం రూ.14,000 కోట్ల అప్పులతో చివరికి దివాళా తీసింది.
బ్యాంకులు నిర్వహించిన వేలంలో రోల్డా ఇండియా దాదాపు రూ.760 కోట్ల నికర ప్రస్తుత విలువ ప్రాతిపదికన అష్టన్ ప్రాపర్టీస్ కంటే ఎక్కువ ధర పలికిందని బ్యాంకులు తెలిపాయి. ఇది మెుత్తం అప్పుల్లో 6 శాతం కంటే తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే వారం ప్రారంభంలో పతంజలి ఆయుర్వేద తన బిడ్‌ను పరిగణనలోకి తీసుకునేలా రుణదాతలను ఆదేశించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లోని ముంబై బెంచ్‌ను ఆశ్రయించింది. పతంజలి ఆయుర్వేద బిడ్డింగ్ మొత్తం రూ.820 కోట్ల నుంచి రూ.830 కోట్లుగా ఉందని సమాచారం.
More From GoodReturns

Layoffs: కోడింగ్ చేసే రోజులు పోయాయా? లేఆఫ్స్ భయాల మధ్య TCS సీఈఓ కీలక వ్యాఖ్యలు!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications