Patanjali: యోగా గురువు బాబా రామ్‌దేవ్ తన వ్యాపారాలను విస్తరించే పనిలో ఉన్నారు. మార్కెట్లో అనేక బ్రాండ్లకు పోటీగా వినియోగదారుల అభిరుచులకు తగినట్లు కొత్త ఉత్పత్తులను సిద్ధం చేశారు.
పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ న్యూట్రాస్యూటికల్స్, హెల్త్ బిస్కెట్లు, న్యూట్రెలా మిల్లెట్ బేస్డ్ ప్రొడక్ట్స్, ప్రీమియం డ్రై ఫ్రూట్స్‌లో కొత్తగా 14 ఉత్పత్తులను విడుదల చేసింది. క్రీడల్లో పాల్గొనే వ్యక్తుల కోసం న్యూట్రెలా స్పోర్ట్స్‌ను ప్రారంభించింది. ఇందులో స్పోర్ట్స్ డ్రింక్స్, స్పోర్ట్స్ విటమిన్స్ అండ్ మినరల్ సప్లిమెంట్స్ ఉన్నాయి. దీనికి తోడు న్యూట్రిలా మ్యాక్సి మిల్లెట్, న్యూట్రిలా మ్యాక్స్ నట్స్ లను విడుదల చేసింది.

దేశంలో స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉత్పత్తులకు వేగంగా పెరుగుతున్న డిమాండ్ అందిపుచ్చుకునేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. 2028 నాటికి ఈ పరిశ్రమ 18 శాతం రేటున వృద్ధి చెంది రూ.8,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. అందుకే పతంజలి ఫుడ్స్ న్యూట్రెలా స్పోర్ట్స్‌ను ప్రారంభించింది. ఇది 6 ఉత్పత్తులు, 19 SKUలను కలిగి ఉంది.
న్యూట్రెలా మాక్స్ మిల్లెట్‌లను కంపెనీ విడుదల చేసింది. సోయా చంక్‌లను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టిన మెుదటి బ్రాండ్ కావటం విశేషం. Nutrela Max Millets రాగి చోకో తృణధాన్యాలతో చేయబడింది. ఇందులో రాగితో పాటు జొన్న, ఓట్స్, గోధుమలు, బియ్యం, మొక్కజొన్న వినియోగిస్తారు. అన్ని వయస్సుల వారికి అనువైన ప్రొటీన్, ఐరన్, డైటరీ ఫైబర్‌లకు ఇది అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ తన ప్రీమియమైజేషన్ డ్రైవ్‌లో భాగంగా మూడు కొత్త బిస్కెట్లను విడుదల చేసింది. అవి రాగి బిస్కెట్, 7-గ్రెయిన్ బిస్కెట్, డైజెస్టివ్ బిస్కెట్. డైజెస్టివ్ బిస్కెట్లు ఇప్పటికే భారతదేశంలో భారీగా వినియోగంలో ఉన్నది. కానీ 7-గ్రెయిన్ బిస్కెట్, రాగి బిస్కట్ ఆరోగ్యకరమైన స్నాకింగ్ ఎంపికల కోసం ప్రీమియం సెగ్మెంట్ వినియోగదారుల అవసరాలను తీరుస్తుందని వెల్లడించింది. కంపెనీ రానున్న ఐదేళ్ల కాలంలో తన వ్యాపార ఆదాయాన్ని రూ.లక్ష కోట్లకు చేర్చాలని యోచిస్తోంది.


Click it and Unblock the Notifications