Tax Notices: దేశంలో ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలికి వరుస ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కరోనా సమయంలో కంపెనీ చేసిన కొన్ని యాడ్స్ ప్రజలను తప్పుదోవపట్టివేవిగా ఉండటంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పన్ను అధికారుల నుంచి కూడా కంపెనీ యాజమాన్యానికి సమస్యలు తలెత్తాయి.
వివరాల్లోకి వెళితే రూ.27.5 కోట్ల పన్ను క్లెయిమ్‌కు సంబంధించి జీఎస్టీ ఇంటెలిజెన్స్ చండీగఢ్ నుంచి కంపెనీ శుక్రవారం షోకాజ్ నోటీసును అందుకోవడంతో పతంజలి ఫుడ్స్‌కు మరో షాక్ తగిలింది. ఇన్‌పుట్ ట్యాక్స్‌కు సంబంధించి అథారిటీ కంపెనీకి హెచ్చరిక జారీ చేసింది. చండీగఢ్ జోనల్ యూనిట్ నుండి కంపెనీకి షోకాజ్ నోటీసు అందింది. పన్ను చట్టాల ప్రకారం జరిమానా విధించవచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

కంపెనీ ఇప్పుడు రూ.27,46,14,343 ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ఎందుకు చేయకూడదు అనే దానికి కారణం చూపవలసి ఉంటుంది. అయితే జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ ముందు FMCG కంపెనీ తనను తాను సమర్థించుకోనుంది. ప్రస్తుతానికి అథారిటీ కేవలం షోకాజ్ నోటీసును మాత్రమే జారీ చేసినందున.. కంపెనీ తన కేసును అథారిటీ ముందు సమర్థించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని కంపెనీ తన స్టాక్ మార్కెట్ ఫైలింగ్స్‌లో వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ పూర్తయ్యే వరకు ఆర్థిక పరమైన నష్టాలను నిర్ణయించలేమని కంపెనీ పేర్కొంది.
పతంజలి ఆయుర్వేద తన వివిధ ఉత్పత్తులను విక్రయించే క్రమంలో.. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలు ఇప్పటికే పలు వాయిదాలకు నేరుగా కోర్టు ముందు హాజరయ్యారు. అయితే ఈ క్రమంలో పతంజలి తరఫున న్యాయవాది కంపెనీ చేసిన తప్పుడు ప్రకటనలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పిందని పేర్కొన్నప్పటికీ ధర్మాసం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని తర్వాత కూడా దేశంలోని ప్రముఖ పత్రికల్లో పతంజలి తరఫున ప్రజలకు, వినియోగదారులకు క్షమాపణలు చెబుతూ పెద్ద యాడ్స్ ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications