రుచి సోయా మేనేజింగ్ డైరెక్టర్‌గా యోగా గురువు బాబా రామ్‌దేవ్ సోదరుడు రామ్ భరత్ నియమితులయ్యారు. 2020 ఆగస్ట్ 19వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలో డైరెక్టర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రుచి సోయా తెలిపింది. రామ్ భరత్ నియామకం 2020 ఆగస్ట్ 19వ తేదీ నుండి అమలులోకి వచ్చిందని, 2022 డిసెంబర్ 17వ తేదీ వరకు పదవిలో ఉంటారని వెల్లడించింది.
యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ను బోర్డు డైరెక్టర్‌గా నియమించేందుకు కూడా వాటాదారుల అనుమతిని కోరింది రుచి సోయా. దివాలా తీసిన రుచి సోయా ఇండస్ట్రీని గత ఏడాది పతంజలి ఆయుర్వేద లిమిటెడ్, దివ్య యోగ్ మందిర్ ట్రస్ట్, పతంజలి పరివర్తన్ ప్రయివేటు లిమిటెడ్, పతంజలి గ్రామోద్యోగ్ సంస్థలతో కూడిన కన్సాక్టియం కొనుగోలు చేసింది. దీంతో ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డును నియమించే హక్కు కొత్త యాజమాన్యానికి లభించినట్లు రుచి సోయా ఇండస్ట్రీస్ తెలిపింది.

గత ఏడాది దివాలా ప్రక్రియలో భాగంగా రుచి సోయాను పతంజలి గ్రూప్ కనుగోలు చేసిన నేపథ్యంలో బోర్డు సభ్యులను నియమించే హక్కును కొత్త యాజమాన్యం పొందినట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఎండీగా నియమించిన రామ్ భరత్‌కు వార్షిక వేతనం రూ.1 చెల్లించనున్నట్లు తెలిపింది. ఆచార్య బాలకృష్ణ హోదాను చైర్మన్‌గా మార్చింది. ఇతని వార్షిక వేతనం కూడా రూ.1.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications