IPO News: గ్రేమార్కెట్లో అదరగొడుతున్న ఐపీవో.. బెట్టింగ్ వేసేందుకు చివరి అవకాశం మే 14..

Aztec Fluids IPO: వచ్చేవారం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి కొత్త ఐపీవోల పరంపరం కొనసాగుతోంది. రద్దీ కారణంగా అనేక లిస్టింగులతో పాటు కొన్ని ఇష్యూల సబ్‌స్క్రిప్షన్ తెరుచుకుని పెట్టుబడిదారులకు మంచి బెట్టింగ్ అవకాశాలను అందిస్తోంది. ఐపీవో మార్కెట్లోకి వస్తున్న ఎస్ఎమ్ఈ స్టాక్ లిస్టింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అజ్టెక్ ఫ్లూయిడ్స్ అండ్ మెషినరీ ఐపీవో గురించే. ప్రస్తుతం ఐపీవోకి గ్రే మార్కెట్‌లో అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఒక్కో షేరు ధర ప్రస్తుతం గ్రేమార్కెట్లో 45 శాతం ప్రీమియం ధరను కలిగి ఉంది. వాస్తవానికి రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం ఐపీవో మే 10న ప్రారంభమై మే 14న ముగియనుంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ఐపీవోలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.24 కోట్లను సమీకరించేందుకు ముమ్మర సన్నాహాలు చేస్తోంది.

Aztec Fluids and Machinery IPO trading with 45Percent premium before listing

ఐపీవో ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.63-67గా నిర్ణయించింది. గుజరాత్ అహ్మదాబాత్ కేంద్రంగా పనిచేస్తున్న అజ్టెక్ ఫ్లూయిడ్స్ అండ్ మెషినరీ గ్రేమార్కెట్లో ఒక్కో షేరుపై రూ.30 ప్రీమియం ధర పలుకుతోంది. ఇదే గనుక లిస్టింగ్ తేదీ మే 17 వరుకు కొనసాగితే జాబితా రోజున ధర రూ.97గా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. కంపెనీ షేర్లు ఈ క్రమంలో బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో లిస్టింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో కంపెనీ 36 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించాలని నిర్ణయించింది.

కంపెనీ తాజా ఐపీవో నుంచి వచ్చే ఆదాయాన్ని Jet Inks Private Limitedలో వాటాను కొనుగోలు చేయడానికి, రుణ చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించాలని నిర్ణయించింది. షేర్ల కేటాయింపు మే 15న, లిస్టింగ్ మే 17న ఉంటుందని సమాచారం. అలాగే ఐపీవో లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా నిర్ణయించింది. 2011లో స్థాపించబడిన కంపెనీ వివిధ పరిశ్రమలకు ప్రింటర్లు, ప్రింటింగ్ మెటీరియల్స్ , ప్రింటర్ విడిభాగాలను పంపిణీ చేస్తోంది. వీటిలో కంటిన్యూయస్ ఇంక్‌జెట్ ప్రింటర్ (CIJ), థర్మల్ ట్రాన్స్‌ఫర్ ఓవర్ ప్రింటర్ (TTO), డ్రాప్ ఆన్ డిమాండ్ ప్రింటర్ (DOD), NIJ ప్రింటర్ & లేజర్ ప్రింటర్ ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+