Azim Premji: విప్రో పేరు మనందరికీ పరిచయం అవసరం లేనిది. ప్రస్తుతం దేశంలోని టాప్ ఐటీ సేవల కంపెనీల్లో ఒకటిగా ఉన్న సంస్థ ఇతర వ్యాపారాలను సైతం కొనసాగిస్తోంది.
ఐటీ కంపెనీని స్థాపించిన వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనవరి 23, 2024న ఆయన కంపెనీలో రూ.500 కోట్లు విలువైన షేర్లను బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇది కంపెనీ మెుత్తం ఈక్విటీ షేర్లలో దాదాపు 0.2 శాతం మాత్రమే. వీటిని తన ఇద్దరు కుమారులైన రిషద్, తారిఖ్ లకు అందిస్తున్నట్లు స్టాక్ మార్కెట్లకు వెల్లడించటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రేమ్‌జీ తన ఇద్దరు కుమారులకు ఒక్కొక్కరికి 51 లక్షల విప్రో ఈక్విటీ షేర్లను తాజా గిఫ్ట్ రూపంలో అందించినట్లు వెల్లడైంది. ప్రస్తుతం కుమారులు రిషద్ ప్రేమ్‌జీ విప్రో ఛైర్మన్‌గా కొనసాగుతుండగా.. విప్రో ఎంటర్‌ప్రైజెస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తారిఖ్ ప్రేమ్‌జీ ఉన్నారు. తాజా బదిలీ తర్వాత అజీమ్ ప్రేమ్‌జీకి కంపెనీలో 4.3 శాతం, రిషద్ అండ్ తారిఖ్‌లకు 0.03 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి.
గతవారం విప్రో కంపెనీ తన మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెలువరించింది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న వ్యాపార మందగమనం నేపథ్యంలో కంపెనీ మార్కెట్లు ఊహించిన అంచనాలను అందుకోలేకపోతోంది. ఈ క్రమంలో నేడు ఉదయం 10.52 గంటల సమయంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ.473.80 రేటు వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications