కరోనాపై పోరుకు గతంలో కంటే డబుల్ డొనేషన్, అజీమ్ ప్రేమ్‌జీ రూ.2000 కోట్ల సాయం
కరోనా మహమ్మారిపై పోరుకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ.2000 కోట్లకు పైగా కేటాయించింది. గతంలో కేటాయించిన నిధుల కంటే ఇది దాదాపు రెండింతలు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ను విప్రో మాజీ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ స్థాపించారు. గత ఏడాది కరోనా మహమ్మారి మొదటిసారి వచ్చినప్పుడు ఈ ఫౌండేషన్ రూ.1,125 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.2,125 కోట్లు కేటాయించారు.
'కరోనా మహమ్మారిపై పోరుకు గతంలో రూ.1,125 కోట్లు కేటాయించాం. ఇప్పుడు రూ.2,125 కోట్లు కేటాయిస్తున్నాం.' అని విప్రో పేర్కొంది. పది రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కోసం ఈ మొత్తం ఉపయోగపడుతుందని పేర్కొంది. డిమాండ్ ఏర్పడితే అవసరమైతే మరిన్ని కేటాయింపులకు సిద్ధమని తెలిపింది.

చత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పుదుచ్చేరి, తెలంగాణ, ఉత్తరాఖండ్, తదితర వెనుకబడిన రాష్ట్రాల్లోని 100 జిల్లాల్లోని 15 కోట్లమందికి వ్యాక్సినేషన్ కోసం, ఇతర కార్యకలాపాల కోసం నిధులు కేటాయించినట్లు తెలిపింది. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ 10,000 ఆక్సిజన్ బెండ్స్, 1,000 ఐసీయులను అందించింది.


Click it and Unblock the Notifications