Azad Engineering IPO: డిసెంబర్ నెల ముగిసేందుకు ఇంకా కేవలం రెండు వారాలు మాత్రమే ఉంది. అయితే ప్రస్తుతం ఐపీవోలు వరుసగా మార్కెట్లోకి క్యూ కట్టాయి. దీంతో భారీ లాభాలను అందిపుచ్చుకుని ఏడాదిని ముగించాలని చాలా మంది ఐపీవోలపై మక్కువ చూపుతున్నారు.
ఈ క్రమంలోనే మార్కెట్లోకి అడుగుపెడుతోంది ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో. ఐపీవో డిసెంబర్ 20న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుండగా.. డిసెంబర్ 22న ముగుస్తుంది. దీనికోసం ప్రైస్ బ్యాండ్ ధరను రూ.499 నుంచి రూ.524గా కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో ఆజాద్ ఇంజినీరింగ్ షేర్లు 76 శాతం కంటే ఎక్కువ అంటే రూ.400 ప్రీమియంతో బలంగా ట్రేడవుతున్నాయి. IPOలో కంపెనీ షేర్లు రూ.524 గరిష్ఠ ధర వద్ద అలాట్ అయితే వాటి లిస్టింగ్ దాదాపు రూ.924 వద్ద ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలోనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇటీవల హైదరాబాద్‌లోని ఆజాద్ ఇంజినీరింగ్‌లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టారు. టెండూల్కర్ కంపెనీలో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేశారనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. అయితే అందుబాటులో ఉన్న వర్గాల సమాచారం ప్రకారం కంపెనీలో చిన్న వాటాను మాత్రమే సచిన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా రూ.740 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ఆజాద్ ఇంజనీరింగ్ షేర్ల కేటాయింపు 26 డిసెంబర్ 2023న ఖరారు కావచ్చు. అలాగే ఐపీవో మార్కెట్ లిస్టింగ్ డిసెంబర్ 28న ఉంటుందని తెలుస్తోంది. దీనికోసం కంపెనీ లాట్ పరిమాణాన్ని 28 షేర్లుగా నిర్ణయించగా.. ఇందులో పాల్గొనేందుకు కనీసం రూ.14,672 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. కంపెనీ డిఫెన్స్ రంగానికి చెందినది. ఇది ఏరోస్పేస్ భాగాలు, టర్బైన్ తయారీలో ఉంది. కంపెనీ తన ఉత్పత్తులను ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఆయిల్ & గ్యాస్ పరిశ్రమల్లోని ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులకు సరఫరా చేస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications