Spiritual Tourism: ఇవాళ అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశం మొత్తం రామనామంతో మారుమోగిపోతోంది. ఎన్నడూలేని విధంగా అయోధ్యలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. పలువురు దిగ్గజ సెలబ్రిటీలు సైతం రాముని సేవలో తరిస్తున్నారు. ఈ సమయంలో జెఫరీస్ చేసిన ప్రకటన రామభక్తులతో పాటు హిందువుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
రామమందిర శంకుస్థాపనతో ఉత్తరప్రదేశ్‌లోని పురాతన పట్టణం అయోధ్యకు పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. రద్దీ పరంగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన మక్కా మరియు వాటికన్ సిటీలను సైతం అధిగమించేందుకు సిద్ధంగా ఉందని ప్రముఖ పరిశోధనా సంస్థ జెఫరీస్ తెలిపింది. భవిష్యత్తులో పెద్ద మొత్తంలో టూరిస్టులు రామమందిర దర్శనానికి విచ్చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.

దేశ ఆర్థిక వ్యవస్థపై రామమందిరం పెద్ద ప్రభావాన్నే చూపనున్నట్లు జెఫరీస్ తేల్చింది. ఏడాదికి దాదాపు 30 మిలియన్ల మంది వాటికన్ సిటీ మరియు మక్కాను చూసేందుకు వెళ్తుంటారు. అయితే వాటిని వెనక్కి నెడుతూ సంవత్సరానికి 50 మిలియన్ల టూరిస్టులను ఇండియాకు ఆకర్షించే సత్తా అయోధ్యకు ఉన్నట్లు అంచనా వేసింది. 25 మిలియన్ల తిరుపతి సందర్శకులకు ఇది రెట్టింపు కావడం విశేషం.
కొత్తగా నిర్మించిన విమానాశ్రయం, పునరుద్ధరించిన రైల్వే స్టేషన్, టౌన్‌షిప్ సహా మెరుగైన రహదారి కనెక్టివిటీ ఇప్పుడు అయోధ్య సొంతమైనట్లు పరిశోధనా సంస్థ పేర్కొంది. కొత్త హోటళ్లు మరియు ఇతర ఆర్థిక కార్యకలాపాలతో 10 బిలియన్ డాలర్ల మేక్ఓవర్ ప్రభావాన్ని చూపిస్తుందని అంచనా వేసింది.
భారత GDPలో టూరిజం వాటా 6.8 శాతం ఉండగా.. అనేక పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నట్లు జెఫరీస్ గుర్తుచేసింది. అయితే రామమందిర ప్రతిష్ఠతో పర్యాటకరంగంలో విదేశీ పెట్టుబడులు భారీగా పెరగనున్నట్లు చెప్పింది. స్పైస్‌జెట్, అకాసా ఎయిర్, మేక్ మై ట్రిప్, ఇండియన్ హోటల్స్, బ్రిటానియా, హిందూస్థాన్ యూనిలీవర్ కంపెనీల వ్యాపారం భారీగా పెరగనున్నట్లు భావిస్తోంది.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications