Investors Alert: ఇన్వెస్టర్లకు రైల్వే స్టాక్‌పై యాక్సిస్ సెక్యూరిటీస్ అలర్ట్.. నష్టపోతారు మీ ఇష్టం..

Railway Stocks: భారతీయ స్టాక్ మార్కెట్లు అనేక త్రైమాసికాలుగా బుల్ జోరును కొనసాగిస్తున్నాయి. మధ్యలో అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా కొంత ఒడిదొడుకులకు లోనైనప్పటికీ స్థిరంగా బెంచ్ మార్క్ సూచీలు గరిష్ఠాలను తాకటం మనం చూస్తూనే ఉన్నాయి.

ఈ క్రమంలో మార్కెట్ల భవితవ్యంపై యాక్సిస్ సెక్యూరిటీస్ PMSకు చెందిన నీరజ్ గౌర్ తన అంచనాలను పంచుకున్నారు. రానున్న కాలంలో స్టాక్ మార్కెట్లు 5-8 శాతం వరకు కరెక్షన్ చూసే అవకాశం ఉందని పేర్కొన్నారు. త్రైమాసికంలో ఆటోమొబైల్స్, ఫార్మాలో అప్‌గ్రేడ్‌లు కనిపించగా.. ఆయిల్ & గ్యాస్, మెటల్స్, సిమెంట్, పారిశ్రామిక రంగాలలో డౌన్‌గ్రేడ్‌లు కనిపించాయి. ఇక మధ్య తరహా ఐటీ కంపెనీల నుంచి అధిక ఆదాయాలు అంచనాలకు అనుగుణంగా ఉంటాయన్నారు. ఇదే క్రమంలో బ్యాంకింగ్ రంగం క్రెడిట్ వృద్ది పటిష్ఠంగా ఉన్నప్పటికీ డిపాజిట్ సమీకరణలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

Axis securities PMS warns about market correction in near future and Railway stocks

ఇక రానున్న రెండుమూడు త్రైమాసికాల్లో మార్కెట్లను నడిపించే అంశాల గురించి స్పందిస్తూ US ఎన్నికలు, భౌగోళిక రాజకీయ నష్టాలు, నవంబర్-డిసెంబర్‌లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి వచ్చే సానుకూల పెట్టుబడి ప్రవాహాలు వంటి కీలక అంశాలు ఉన్నాయని యాక్సిస్ సెక్యూరిటీస్ పేర్కొంది. ఈ క్రమంలో రైల్వే రంగంలోని కంపెనీల షేర్లపై స్పందిస్తూ తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలలో ఇవి లేవని పేర్కొంది. తాము ప్రస్తుతం ఇతర రంగాలలో ఎక్కువ విలువను చూస్తున్నట్లు వెల్లడించింది. సాధారణంగా విపరీతమైన వాల్యుయేషన్‌లు ఉన్న సెక్టార్‌లను నివారిస్తామని పేర్కొంటూ.. అధిక విలువ కలిగిన రైల్వే స్టాక్‌లను నివారించాలని నీరజ్ ఇన్వెస్టర్లకు సూచించారు.

భౌగోళిక రాజకీయ ఆందోళనల నుంచి సమీప కాలంలో పొంచిఉన్న సంభావ్య ప్రమాదాలతో కొత్త మార్కెట్ గరిష్టాలను చుట్టుముట్టే ఉత్సాహాన్ని సమతుల్యం చేయడం ముఖ్యమన్నారు. ఆర్థిక వ్యవస్థకు సానుకూల దృక్పథం ఉన్నప్పటికీ.. భారతీయ ఈక్విటీ మార్కెట్లు 5-8% కరెక్షన్‌ను చూడవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ నిపుణులు అంచనా వేశారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు తమ డబ్బును ప్రధానంగా స్మాల్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు ఎగబడటం కంటే బహుళ ఆస్తి కేటరిగీలు, విభిన్న పోర్ట్‌ఫోలియోలలో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించాలని సూచించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+