Stock Ideas: డబ్బు రెట్టింపు చేసుకోవాలంటే ఈ స్టాక్ కొనండి.. బ్రోకరేజ్ ఎంపిక..
Stock Tips: ప్రస్తుతం దేశంలోని ఈక్విటీ మార్కెట్లు ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని షేర్లపై ఇటు ఇన్వెస్టర్లు అటు బ్రోకరేజీలు చాలా ఆసక్తిగా ఉన్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది Pitti Engineering Ltd కంపెనీ షేర్ల గురించే. గడచిన మూడేళ్ల కాలంలో ఈ షేరు 2000 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఇది కంపెనీ పెరుగుతున్న సామర్థ్యం, గ్లోబల్ ఫుట్‌ప్రింట్‌తో పాటు బలమైన ఆర్డర్ బుక్‌పై బలమైన బుల్లిష్‌నెస్‌ను ప్రతిబింబిస్తుంది. ఈ కంపెనీ షేర్లపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యాక్సిస్ సెక్యూరిటీస్ BUY రేటింగ్ అందించింది. ఇందుకోసం కంపెనీ షేర్లకు రూ.915 ధరను టార్గెట్ రేటుగా నిర్ణయించింది.

వాస్తవానికి శుక్రవారం స్టాక్ ముగింపు ధర రూ.658.95గా ఉంది. బ్రోకరేజ్ సంస్థ అంచనా ధర ప్రస్తుత మార్కెట్ ధర కంటే దాదాపు 40 శాతం అధికం. గత ట్రేడింగ్ సెషన్‌లో PEL షేర్లు బీఎస్ఈలో 1.21 శాతం పెరిగి రూ.658.95 వద్ద ముగిసింది. స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉన్న కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,111.94 కోట్లుగా ఉంది. కంపెనీని FY26 ఆదాయాలపై 19x విలువతో షేరుకు రూ.915 టార్గెట్ ధరను ఇస్తున్నట్లు యాక్సిస్ సెక్యూరిటీస్ తెలిపింది.
FY26 నాటికి కంపెనీ ఆదాయం 13 శాతం వార్షిక వృద్ధి రేటు(CAGR)తో రూ.1,588 కోట్లకు పెరుగుతుందని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. కంపెనీకి హైదరాబాదులో రెండు అతిపెద్ద తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రధానంగా వీటి నుంచి తయారయ్యే మెుత్తాన్ని ఎగుమతులకు వినియోగిస్తారు. అలాగే ఔరంగాబాదులో కంపెనీకి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ తయారీ కేంద్రం కూడా ఒకటి ఉంది. భారీ యంత్రాలతో పాటు వివిధ విడిభాగాలను సైతం కంపెనీ తయారు చేస్తోంది.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి అధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పూర్తిగా నష్టాలకు కూడుకున్నవి. ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకునే ముందు తప్పక మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించండి.


Click it and Unblock the Notifications