Gold ETF: గుడ్ న్యూస్.. గోల్డ్ ఈటీఎఫ్‌లపై ఆంక్షలు ఎత్తేసిన పలు మ్యూచువల్ ఫండ్లు..!
ప్రస్తుత సమయంలో సురక్షితమైన పెట్టుబడి వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. ఇటు రిటైల్ ఇన్వెస్టర్లు కూడా సురక్షితమైన పెట్టుబడి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ అందరు బంగారంపై పెట్టుబడిని సురక్షితంగా చూస్తున్నారు. అందుకే ఇప్పుడు బంగారం పెట్టుబడి పెడుతున్నారు. అయితే ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేయాలంటే ఎక్కువ డబ్బు అవసరం. పైగా భద్రత ఉండాలి. అందుకే చిన్న చిన్న పెట్టుబడిదారులు గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లల్లో పెట్టుబడి పెడుతున్నారు. అయితే గత జనవరిలో బంగారం ధర భారీగా పెరగడంతో అప్పుడు బంగారం ఈటీఎఫ్ ల్లో భారీగా పెట్టుబడి పెట్టారు. దీంతో పలు ఫండ్ హౌస్ లు గోల్డ్ ఈటీఎఫ్ లపై ఆంక్షలు విధించాయి.
తాజాగా కొన్ని మ్యూచువల్ ఫండ్ హౌస్ లు గోల్డ్ ఈటీఎఫ్ లపై ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. యూక్సిస్ మ్యూచువల్ ఫండ్ హౌస్, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ హోస్ తమ గోల్డ్ ఫండ్స్, ఈటీఎఫ్ లపై ఆంక్షలు ఎత్తివేసినట్లు ప్రకటించాయి. ఇప్పుడు వాటిలో పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ నిర్ణయంతో గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ లలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మళ్లీ అవకాశం లభించింది. హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ తన హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్‌లో లంప్ సమ్ పెట్టుబడులపై గతంలో విధించినటువంటి తాత్కాలిక పరిమితులను తాజాగా ఎత్తివేసింది.

2026, ఆగస్ట్ 14 నుంచి ఈ పథకంలో లంప్ సమ్ కొనుగోళ్లు, స్విచ్ - ఇన్‌లను ఎలాంటి పరిమితులు లేకుండా స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే గోల్డ్ ఆధారిత పెట్టుబడులపై ఆంక్షలను ఎత్తివేసిన మ్యూచువల్ ఫండ్లలో టాటా మ్యూచువల్ ఫండ్ , ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ ఉన్నాయి. 2026 జూన్ నెలలో పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు గోల్డ్ ఫండ్లలో కొత్త పెట్టుబడులపై తాత్కాలిక ఆంక్షలు విధించాయి. గత సంవత్సరం కాలంగా టాటా గోల్డ్ ఈటీఎఫ్ 53.16 శాతం రాబడి ఇచ్చింది. నిప్పాన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్ 52.71 శాతం రాబడి ఇచ్చింది. గ్రో గోల్డ్ ఈటీఎఫ్ సంవత్సర కాలంలో 52.46 శాతం రాబడి ఇచ్చింది.
ఐసీఐసీఐ ప్రుడెన్షయల్ గోల్డ్ ఈటీఎఫ్ ఏడాది కాలంలో 53.33 శాతం రాబడి ఇచ్చింది. జెరోధ గోల్డ్ ఈటీఎఫ్ సంవత్సర కాలంలో 53.30 శాతం రాబడి ఇవ్వగా.. ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్ ఏడాది కాలంలో 53.03 శాతం, హెచ్డీఎఫ్సీ గోల్డ్ ఈటీఎఫ్ 53.15 శాతం, యాక్సెస్ గోల్డ్ ఈటీఎఫ్ 52.97 శాతం రాబడి ఇచ్చింది. అయితే గత సంవత్సర కాలంగా పసిడి ధరలు భారీగా పెరగడం వల్ల రాబడి పెరిగింది. మూడేళ్ల కాలనికి రాబడులు పరిశీలిస్తే ఎల్ఐసీ గోల్డ్ ఈటీఎఫ్ 37 శాతం రాబడి ఇచ్చింది. ఇదే కాలానికి యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్ 37.02 శాతం రాబడి ఇచ్చింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications