Axis Bank Stock: దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ నేడు భారత స్టాక్ మార్కెట్లలో భారీ పతనాన్ని చూస్తోంది. ఇంట్రాడేలో స్టాక్ ఎన్ఎస్ఈలో టాప్ లూజర్ స్టాక్‌గా కొనసాగుతోంది. ఈ క్రమంలో స్టాక్ 7 శాతం పైగా పతనాన్ని నమోదు చేసింది.
వాస్తవానికి నేడు యాక్సి బ్యాంక్ షేర్లను ఇన్వెస్టర్లు విక్రయించటం షేర్లపై భారీ ఒత్తిడిని కలిగిస్తోంది. దీనికి కారణాలను పరిశీలిస్తే కంపెనీ నిన్న స్టాక్ మార్కెట్లు ముగించిన తర్వాత ప్రకటించిన మెుదటి త్రైమాసిక ఫలితాలని తెలుస్తోంది. ఈ ఫలితాల్లో మార్కెట్ల అంచనాలకు అనుగుణంగా లాభాలు వచ్చినప్పటికీ కంపెనీ అసెట్ క్వాలిటీ తగ్గటం పెద్ద ఆందోళనలు కలిగిస్తోంది. దీని ఫలితాంగా క్యూ1 తర్వాత బ్యాంక్ క్రెడిట్ ఖర్చులు పెరుగుతాయని బ్యాంక్ అంచనా వేస్తోంది.

కంపెనీ క్యూ1 నివేదిక ప్రకారం కార్పొరేట్ లోన్ పోర్ట్‌ఫోలియోలో తక్కువ రికవరీలతో పాటు అప్‌గ్రేడ్‌ల కారణంగా క్రెడిట్ ఖర్చుల్లో దాదాపు 55 శాతం పెరుగుదల జరిగిందని మేనేజ్‌మెంట్ సూచించింది. ప్రధానంగా రికవరీలు మందగించడం వల్ల బ్యాంక్ ఆర్థిక దృక్పథంపై మరింత ఒత్తిడి పడుతుందని ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. నికర నిరర్థక ఆస్తుల్లో పెరుగుదల వృద్ధిపై ఆందోళనలు పెంచుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎంకే గ్లోబల్ యాక్సిస్ బ్యాంక్ షేర్లకు రూ.1,400 టార్గెట్ ధరతో BUY రేటింగ్‌ను కొనసాగించింది. ఇదేం యాక్సిస్ బ్యాంక్ షేర్లపై జేఎం ఫైనాన్షియల్ సానుకూల వైఖరిని కొనసాగించింది. అలాగే తన BUY రేటింగ్ కొనసాగిస్తూ టార్గెట్ ధరను రూ.1,375 టార్గెట్ ధరగా నిర్ణయించింది.
త్రైమాసిక ఫలితాలు:
జూన్‌తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ నికర లాభం 4 శాతం పెరిగి రూ.6,035 కోట్లగా నమోదైంది. ఈ క్రమంలో వడ్డీ ఆదాయం రూ.30,060.73 కోట్లకు పెరిగింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.25,556.77 కోట్లుగా ఉన్నట్లు బ్యాంక్ పేర్కొంది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.35,844.22 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications