డిసెంబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును పెంచిన తర్వాత, అనేక బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేట్లను మళ్లీ పెంచుతున్నాయి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటును కూడా పెంచుతోన్నాయి. ఆర్బీఐ మే నుంచి రెపో రేటు ఐదుసార్లు పెంచింది. మేలో 40 శాతం, జూన్‌లో 50 శాతం, ఆగస్టులో 50 శాతం, సెప్టెంబర్‌లో 50 శాతం, డిసెంబర్లో 35 శాతం. దీంతో యాక్సిస్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి.

సీనియర్ సిటిజన్లకు
ప్రధానంగా సీనియర్ సిటిజన్లకు FD రేటును పెంచాయి. సీనియర్ సిటిజన్లకు జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FDపై 8.8 శాతం వడ్డీ రేటును చెల్లిస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు యాక్సిస్ బ్యాంక్ 3.50% నుండి 7.75% వరకు వడ్డీ రేటును చెల్లిస్తున్నారు. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డిసెంబర్ 15, 2022 నుండి ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది.

FDపై వడ్డీ రేటు 8.3
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుతం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల FDలపై 7.85% వడ్డీ రేటును చెల్లిస్తోంది. ఇది 2 నుంచి 3 సంవత్సరాల కాలవ్యవధితో సీనియర్ సిటిజన్లకు FDపై 8.80% వడ్డీ రేటును అందిస్తుంది. ఇది ఒక సంవత్సరం FDపై 8.20 శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది. 5 సంవత్సరాల FDపై 8.2 శాతం వడ్డీ రేటు 1 నుంచి 2 సంవత్సరాల FDపై 8.45 శాతం వడ్డీ రేటు చెల్లిస్తున్నారు. 3-5 సంవత్సరాల కాలవ్యవధితో FDపై వడ్డీ రేటు 8.3 శాతంగా ఉంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్
కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఆల్-టర్మ్ FD వడ్డీ రేట్లను సవరించింది. డిసెంబర్ 15, 2022 నుంచి FD వడ్డీ రేటు పెంచింది. 390 రోజులు FDపై వడ్డీ రేటు 7 శాతం వడ్డీ రేటు చెల్లిస్తున్నారు. 391 రోజులు కంటే తక్కువ వ్యవధి ఉన్న FDపై FD రేటు 7%. కోటక్ మహీంద్రా బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 390, 391 రోజులు లేదా 23 నెలల FDపై 7.5% వడ్డీ రేటును అందిస్తుంది. 365-389 రోజుల డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

7 రోజుల నుంచి 10 సంవత్సరాలు
9 నెలలు లేదా అంతకంటే తక్కువ మెచ్యూరిటీ ఉన్న FDలు 6% వడ్డీ రేటుతో అందిస్తున్నారు. ఒక సంవత్సరం, 2 సంవత్సరాల కంటే తక్కువ FDలపై 6.75% వడ్డీ రేటు చెల్లిస్తున్నారు. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మెచ్యూరిటీ ఉన్న FDలపై సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 3.5 శాతం నుంచి 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications