ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు యాక్సిస్ బ్యాంకు శుభవార్త అందించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచినట్లు ప్రకటించింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, కొత్త వడ్డీ రేట్లు సెప్టెంబర్ 9, 2022 నుంచి అమల్లోకి వచ్చాయి. వివిధ కాలవ్యవధి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. 7 రోజుల నుంచి 6 నెలల వరకు మెచ్యూరిటీల కోసం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 bps పెంచింది.

అత్యల్పంగా 2.75 శాతం
7 రోజుల నుంచి 29 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ వడ్డీ రేటును 2.75%కి పెంచింది.30 రోజుల నుంచి 3 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేటును 3% నుంచి 3.25%కి పెంచింది. 3 నెలల నుండి 6 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇప్పుడు 3.75% వడ్డీని ఇవ్వనుంది.6 నెలల నుంచి 7 నెలల వరకు, 7 నెలల నుండి 8 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై, బ్యాంక్ వరుసగా 4.65%, 4.40% వడ్డీ రేటును అందించనుంది. 8 నెలల నుంచి 9 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.65%కి పెంచింది.

5.75%
9 నెలల నుంచి 1 సంవత్సరం వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.75 శాతం ఉండగా.. 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 11 రోజులలో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.45% వద్ద స్థిరంగా ఉంచింది. 1 సంవత్సరం 11 రోజుల నుండి 1 సంవత్సరం 25 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై, యాక్సిస్ బ్యాంక్ 5.75% వడ్డీ రేటును కొనసాగిస్తుంది.

సీనియర్ సిటిజన్
7 రోజుల నుంచి 29 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై, సీనియర్ సిటిజన్లు 2.75% వడ్డీ రేటును పొందుతారు. సీనియర్ సిటిజన్లు ఇప్పుడు 1 సంవత్సరం నుండి 1 సంవత్సరం 11 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.20% వడ్డీ రేటును అందివ్వనున్నారు. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై, సీనియర్ సిటిజన్లు 6.50% వడ్డీ రేటును ఇవ్వనున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications