Axis Bank: లోన్ తీసుకుంటే 12 EMIలు కట్టక్కర్లేదు.. కస్టమర్లకు యాక్సిస్ బ్యాంక్ మెగా ఆఫర్
దాదాపు ప్రతి మధ్యతరగతి కుటుంబానికి సొంతిల్లు కలిగి ఉండటం ఓ కల. దానిని నెరవేర్చుకునేందుకు అప్పులు చేయడానికి సైతం వెనకాడటం లేదు. బ్యాంకులు కూడా EMI పద్ధతిలో తిరిగి చెల్లింపునకు అనుమతి ఇస్తూ.. భారీ మొత్తంలో లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఈ తరహా లోన్ తీసుకునే వారికి ప్రముఖ ప్రైవేట్ రంగ లెండర్ యాక్సిక్ బ్యాంక్ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ఫాస్ట్ ఫార్వర్డ్ లోన్ కింద యాక్సిస్ బ్యాంక్ గృహరుణాలు అందిస్తోంది. ఇందులో భాగంగా కాలవ్యవధి ఆధారంగా కొన్ని EMIలు మాఫీ చేయనున్నట్లు తెలిపింది. పాత, కొత్త ఫ్లాట్ లేదా ఇల్లు కొనుగోలుతో పాటు గృహ నిర్మాణానికి కూడా ఈ ఆఫర్ వర్తించనున్నట్లు తెలుస్తోంది. వీటికి అదనంగా బ్యాలెన్స్ ట్రాన్సఫర్, డోర్ స్టెప్ సర్వీస్ ను సైతం అందిస్తోంది.

సుమారు 30 లక్షల వరకు ఈ స్కీమ్ ద్వారా లోన్ పొందే అవకాశం ఉంది. 12 EMIల మాఫీని ఒక్కసారిగా అందించకుండా టెన్యూర్ ఆధారంగా రెండు భాగాలుగా విభజించింది. 10 ఏళ్ల పాటు వాయిదాలు చెల్లించిన వారికి 6 EMIలు, 15 సంవత్సరాలు కడితే 10 EMIల మాఫీ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదని గమనించాల్సి ఉంటుంది.
రీపేమెంట్ ట్రాక్ సరిగ్గా ఉంటేనే బ్యాంక్ మాఫీని అమలు చేస్తుంది. లోన్ టెన్యూర్ కనీసం 20 ఏళ్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. రుణం మంజూరు విషయంలో సిబిల్ స్కోర్ కీలకంగా వ్యవహరిస్తుంది. 751 కంటే ఎక్కువ స్కోర్ ఉన్న వారికి 8.74 శాతం వడ్డీతో బ్యాంక్ లోన్ ఆఫర్ చేస్తోంది. స్వయం ఉపాధి కలిగిన వారికి ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలను బ్యాంక్ తన అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచింది.


Click it and Unblock the Notifications