Axis Bank Results: దేశీయ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ నేడు మార్కెట్లు ముగిసిన తర్వాత తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అయితే కంపెనీ పనితీరు గతంలో కంటే కొత్త తగ్గినట్లు ఫలితాలు చెబుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. క్యూ1 ఫలితాల్లో యాక్సిస్ బ్యాంక్ నికర లాభం 4 శాతం పెరిగి రూ.6,035 కోట్లకు చేరుకుంది. ఇది మార్కెట్లోని 8 బ్రోకరేజ్ సంస్థలు సగటున అంచనా వేసిన రూ.5,797 కోట్లను అధిగమించింది. అయితే సీక్వెన్షియల్ ప్రాతిపదికన బ్యాంక్ లాభం రూ.7,130 కోట్ల నుంచి 15 శాతం తగ్గింది. కంపెనీ స్థూల నిరర్థక ఆస్తులు 11 బేసిస్ పాయింట్లు పెరిగి 1.54 శాతానికి చేరుకుంది. ఇదే క్రమంలో నికర నిరర్థక ఆస్తులు 3 పాయింట్లు పెరిగి 0.34 శాతంగా ఉన్నట్లు బ్యాంక్ నివేదించింది.

ముంబై ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆస్తుల నాణ్యత క్రమంగా దిగజారుతోంది. ఇది ప్రస్తుతం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఏడాది ప్రాతిపదికన బ్యాంక్ GNPA 42 బేసిస్ పాయింట్లు, NNPA వరుసగా 7 బేసిస్ పాయింట్లు మెరుగుపడ్డాయి. ప్రస్తుతం చూస్తున్న ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం ఏడాది కిందట ఇదే కాలంలో రూ.11,959 కోట్ల నుంచి రూ.13,448 కోట్లకు పెరిగినట్లు యాక్సిస్ బ్యాంక్ నివేదించింది. మెుదటి త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్ గత ఏడాది 4.10 శాతంతో పోలిస్తే 4.05 శాతంగా ఉంది. ఇక డిపాజిట్ల విషయానికి వస్తే ఏడాదికి 13 శాతం పెరిగాయి. ఇందులో కరెంట్ అకౌంట్ డిపాజిట్లు 12 శాతం, మొత్తం టర్మ్ డిపాజిట్లు 20 శాతం వృద్ధిని చూసాయి. CASA రేషియో 42 శాతంగా ఉంది.
బ్యాంక్ అడ్వాన్స్‌లు ఏడాది ప్రాతిపదికన 14 శాతం పెరిగి రూ.9.80 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అలాగే రిటైల్ లోన్స్ ఏడాదికి 18 శాతం పెరిగి రూ.5.85 లక్షల కోట్లకున్నట్లు బ్యాంక్ నివేదించింది. ఇదే క్రమంలో యూపీఐ పేమెంట్స్ లావాదేవీల్లో బ్యాంక్ 61 శాతం వృద్ధిని నమోదు చేసింది. నేడు మార్కెట్ల ముగింపు సమయంలో బ్యాంక్ స్టాక్ ధర ఎన్ఎస్ఈలో 1.82 శాతం తగ్గి రూ.1,240 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం బ్యాంక్


Click it and Unblock the Notifications