యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ దారులకు శుభవార్త చెప్పాయి. ఈ రెండు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. యాక్సిస్ బ్యాంక్ రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మరోసారి వడ్డీ రేట్లను పెంచింది. నవంబర్ 5, 2022న 46 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ ఇప్పటికే 115 bps వరకు పెంచింది. తాజాగా వివిధ రకాల కాల వ్యవధుల డిపాజిట్లపై 20 bps వరకు పెంచింది.

30 బేసిస్ పాయింట్లు
ICICI బ్యాంక్ కూడా FDలపై 30 బేసిస్ పాయింట్లను పెంచింది. రూ. 2 కోట్ కంటే తక్కువ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 16 నుంచి బ్యాంక్ అమలులోకి వచ్చాయి. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు వివిధ కాల వ్యవధి కలిగిన FDలపై బ్యాంక్ 6.60 శాతం వడ్డీని అందిస్తోంది. ఇంతకుముందు, ఐసిఐసిఐ బ్యాంక్ అక్టోబర్ 29 న వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది.

6.40%కి పెంపు
ప్రస్తుత మార్పు తర్వాత, ICICI బ్యాంక్ 15 నుంచి 18 నెలల FDలపై వడ్డీని 6.10 శాతం నుంచి 6.40 శాతానికి పెంచింది. 18 నెలల నుంచి 24 నెలల ఎఫ్‌డీలపై కేవలం 6.40 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుంది. అంతకుముందు ఇది 6.15 శాతంగా ఉంది. యాక్సిస్ బ్యాంక్ 7 రోజుల నుంచి 45 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే FDలపై బ్యాంక్ 3.50% వడ్డీ రేటును అందిస్తుంది. 15 నెలల నుండి 18 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై, బ్యాంక్ వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్లు 6.25% నుంచి 6.40%కి పెంచింది.

సీనియర్ సిటిజన్
ఆరు నెలల నుండి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై, యాక్సిస్ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌లకు అదనపు వడ్డీ రేటు ప్రోత్సాహకాలను అందిస్తుంది. వివిధ అవధి స్లాబ్‌లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై, యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు సీనియర్ సిటిజన్‌లకు 5.50% నుంచి 7.25% వడ్డీ రేటు అందిస్తోంది. 18 నెలల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లు ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్‌లకు గరిష్టంగా 7.25% వడ్డీ రేటును ఇస్తోంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications