Amazon Jobs: అమెజాన్ మెగా పెట్టుబడి ప్లాన్.. ఇండియాలో ఏటా లక్షకు పైగా ఉద్యోగాలు..!
Amazon Jobs: ఒకపక్క ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్న వేళ అమెజానా గుడ్ న్యూస్ వెల్లడించింది. భారతదేశంలో క్లౌడ్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి తన పెట్టుబడి ప్రణాళికను వెల్లడించింది.
కంపెనీ తీసుకున్న పెట్టుబడి నిర్ణయం వల్ల ఏటా దేశంలో సగటున 131,700 ఉద్యోగాల కల్పన జరుగుతుందని కంపెనీ అంచనా వేసింది. ఇటీవలి పెట్టుబడి ప్రణాళికతో దేశంలో AWS మొత్తం పెట్టుబడి 2030 నాటికి 16.4 బిలియన్ డాలర్లకు పెరుగుతుంది. 2016-22 మధ్య కాలంలో కంపెనీ మనదేశంలో దాదాపు 3 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను పెట్టింది.

AWS భారతదేశం డిజిటల్ పవర్‌హౌస్‌గా చాలా కాలం నుంచి అభివృద్ధి చెందుతోందని సీఈవో ఆడమ్ సెలిప్‌స్కీ వెల్లడించారు. భారీ ప్రపంచ అనిశ్చితి యుగంలో భారత్ "ప్రకాశవంతమైన ప్రదేశం"గా నిలిచిందని ఆయన వెల్లడించారు. సాంప్రదాయ పద్ధతిలో సాగుతున్న వ్యపారాలు డిజిటల్ బాట పట్టేందుకు కంపెనీ సేవలు కీలకంగా మారనున్నాయి. భారతదేశంలో డిజిటల్ ఆవిష్కరణలు చాలా వేగంగా సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
అమెరికా యూరప్ మార్కెట్ల కంటే భారత మార్కెట్ మెరుగ్గా ఉందని సీఈవో వెల్లడించారు. 2025 నాటికి ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీని నిర్మించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ ఆశయాలను సాకారం చేసుకోవడానికి క్లౌడ్ టెక్నాలజీని స్వీకరించడం భారతదేశానికి కీలకమని ఆయన అన్నారు. దీనికి అవసరమైన డేటా సెంటర్లను ఇండియాలో విస్తరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీకి ముంబై, హైదరాబాదుల్లో సెంటర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications