GoFirst: నేలకూలిన కంపెనీని కొనేందుకు ఎగబడుతున్న ఎయిర్‌లైనర్..!!
Spicejet Shares: బడ్జెట్ విమానసేవల సంస్థ గోఫస్ట్ నగదు కొరతతో ఈ ఏడాది గ్రౌండ్ అయిన సంగతి తెలిసిందే. అయితే దీనిని కొనుగోలు చేసేందుకు తాజాగా స్పైస్‌జెట్ చూస్తున్నట్లు మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.
బలమైన విమానయాన సంస్థను నిర్మించడంలో ఈ కొనుగోలు సహాయపడుతుందని స్పైస్ జెట్ భావిస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు అనుకూలంగా 270 మిలియన్ డాలర్ల మూలధనాన్ని సేకరించేందుకు డైరెక్టర్ల బోర్డు సైతం ఆమోదం తెలిపింది.

ప్రాట్ & విట్నీ ఇంజిన్ల సరఫరాలో సమస్యల కారణంగా గో ఫస్ట్ మే 3 నుంచి విమాన సేవలను నిలిపివేసింది. కంపెనీ ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో స్పైస్ జెట్ కాకుండా మరో రెండు సంస్థలు గో ఫస్ట్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తిని కనబరిచినట్లు వెల్లడైంది. వీటిలో ఆఫ్రికాకు చెందిన సఫ్రిక్ ఇన్వెస్ట్‌మెంట్స్, షార్జాకు చెందిన స్కైవన్ ఉన్నాయి.
గతంలో గోఫస్ట్ దివాలా ప్రక్రియ కింద ఆఫర్ చేయడానికి గడువు 22 నవంబర్ 2023న ముగిసిందే. అయితే ఇచ్చిన గడువు సమయంలో ఎవరూ గో ఫస్ట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. గడువు ముగిసిన తర్వాత, రుణదాతలకు గడువును పొడిగించడానికి లేదా లిక్విడేషన్ మార్గంలో కొనసాగడానికి రెండు ఆప్షన్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు స్పైస్‌జెట్ దీనిపై ఆసక్తి చూపింది. ఈ వార్తల నేపథ్యంలో గత రెండు రోజులుగా కంపెనీ షేర్లు 29 శాతానికి పైగా పెరిగాయి. నేడు సైతం స్టాక్ తన ర్యాలీని కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications