Salary Hikes: వామ్మో నెలకింత జీతమా..!!పైలట్ల జీతాలు పెంచిన విమాన సంస్థ
SpiceJet: విమానయాన రంగంలో చాలా ఒడిదొడుకులు కొనసాగుతున్న తరుణంలో బడ్జెట్ క్యారియర్ స్పైస్ జెట్ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పైలట్లకు చెల్లించే వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు మే 23, 2023న ప్రకటించింది.
నిన్నటితో స్పైస్ జెట్ తన ప్రయాణాన్ని ప్రారంభించి 18 ఏళ్లు గడుస్తోంది. తొలిసారిగా సంస్థ మే 23, 2005లో తన తొలి విమానాన్ని దిల్లీ-అహ్మదాబాద్ మధ్య నడిపటంతో వ్యాపారాన్ని ప్రారంభించింది. నెలకు 75 గంటల విమానాన్ని నడిపే పైలట్లకు చెల్లించే వేతనాన్ని రూ.7.5 లక్షలు చేస్తున్నట్లు వెల్లడైంది. తాజాగా పెంచిన వేతనాలు మే 16,2023 నుంచి అమలులోకి వస్తాయని తెలుస్తోంది.

దీనికి ముందు నవంబరు 2022లో కంపెనీ పైలట్లకు వేతనాలను పెంచింది. అప్పట్లో నెలకు 80 గంటలు విమానాన్ని నడిపే పైలట్లకు రూ.7 లక్షలు చేసింది. అలాగే టైనర్లు, ఫస్ట్ ఆఫీసర్ల వేతనాలను సైతం కంపెనీ పెంచింది. అదనంగా ఎయిర్‌లైన్ తన కెప్టెన్‌లకు నెలకు రూ. లక్ష వరకు పదవీకాలం-లింక్డ్ నెలవారీ లాయల్టీ రివార్డ్‌ను ప్రకటించింది.
ప్రయాణం మెుదలు పెట్టి 18 ఏళ్లు గడుస్తున్న ఎయిర్ లైన్ సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కంపెనీ రీస్ట్రక్చరించ్ ప్రక్రియను చేపడుతోంది. మే 11, 2023న దివాలా ప్రక్రియ కోసం దాఖలు చేసే ఆలోచన లేదని స్పైస్‌జెట్ వెల్లడించింది. ఇదే క్రమంలో గ్రౌన్దేడ్ ఫ్లీట్‌ను 50 మిలియన్ డాలర్లు వెచ్చించి పునరుద్ధరించే ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో భారీగా పతనమయ్యాయి.


Click it and Unblock the Notifications