భారతదేశంలో పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. అది ఒక భారీ వేడుక.. అంతకు మించి ఒక భారీ ఖర్చుతో కూడుకున్న విషయం. ఇటీవల ప్రముఖ ఫైనాన్స్ నిపుణుడు సార్థక్ అహుజా లింక్డ్ ఇన్ ద్వారా పంచుకున్న వివరాల ప్రకారం.. మన దేశంలో పెళ్లిళ్ల ఖర్చు ఆకాశాన్ని తాకుతోంది. ఈ ఏడాది దాదాపు 50 లక్షల పెళ్లిళ్లు జరిగాయని అంచనా. అంటే కోటి మంది కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. కానీ, ఈ వేడుకల వెనుక ఉన్న ఆర్థిక లెక్కలు చూస్తే సామాన్యుడికి దిమ్మతిరగడం ఖాయం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశం ట్రెండింగ్ టాపిక్ (trending topic) గా మారింది.

సగటు పెళ్లి ఖర్చు ఎంత?
ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో ఒక సగటు పెళ్లికి రూ.40 లక్షలకు పైగా ఖర్చవుతోంది. అదే జైపూర్ వంటి ప్రాంతాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలంటే రూ.75 లక్షల నుండి కోట్లలో అవుతోంది. ఇక ఉన్నత వర్గాల (Elite class) విషయానికి వస్తే.. ఒక పెళ్లి బడ్జెట్ రూ.1 కోటి నుండి రూ.2 కోట్ల మధ్య ఉంటోంది. విషాదం ఏంటంటే.. ఈ పెళ్లి ఖర్చులో దాదాపు 20-25% శాతం డబ్బును అప్పుల (Debt) రూపంలో తీసుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
వెడ్డింగ్ ఇన్సూరెన్స్: కొత్త ట్రెండ్
పెళ్లి ఖర్చులు కోట్లకు చేరడంతో.. ఇప్పుడు కొత్తగా 'వెడ్డింగ్ ఇన్సూరెన్స్(Wedding Insurance)' కాన్సెప్ట్ వెలుగులోకి వచ్చింది. కోటి రూపాయల పెళ్లికి సుమారు రూ.50,000 ప్రీమియం చెల్లిస్తే చాలు.. పెళ్లిలో జరిగే అనేక నష్టాలకు ఇన్సూరెన్స్ కంపెనీలు పరిహారం ఇస్తాయి.
ఈ ఇన్సూరెన్స్ దేనికి వర్తిస్తుంది?
- నగలు దొంగతనం: పెళ్లిలో బంగారం, విలువైన వస్తువులు పోతే క్లెయిమ్ చేసుకోవచ్చు.
- అగ్ని ప్రమాదాలు లేదా యాక్సిడెంట్స్: ఫంక్షన్ హాల్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే రక్షణ ఉంటుంది.
- పెళ్లి రద్దు: వధూవరులకు అనారోగ్యం కలిగినా లేదా అనుకోని కారణాల వల్ల పెళ్లి ఆగిపోయినా.. హోటల్స్ మరియు వెండర్లకు ఇచ్చిన 'నాన్-రిఫండబుల్' అడ్వాన్స్‌లు తిరిగి పొందవచ్చు.
- ఫ్లైట్ క్యాన్సిలేషన్: ముఖ్యమైన బంధువుల విమానాలు రద్దయినా ఈ పాలసీ ఆదుకుంటుంది.
సామాజిక హోదా కోసమేనా ఈ ఆడంబరాలు?
ప్రస్తుత సమాజంలో పెళ్లి అనేది ఒక సాంప్రదాయంగా కంటే 'సోషల్ సిగ్నలింగ్' అంటే మేము తక్కువ కాదు అని చెప్పుకోవడం లాగా మారిపోయిందని నిపుణులు అంటున్నారు. పర్సనల్ లోన్లు, 'బై నౌ పే లేటర్' (BNPL) వంటి సౌకర్యాలు ఉండటంతో భవిష్యత్తు ఆదాయాన్ని నేడే ఖర్చు చేసేస్తున్నారు.
పాత కాలంలో పెళ్లిళ్లు.. పొదుపు చేసిన సొమ్ముతో చాలా సింపుల్‌గా జరిగేవి. కానీ, ఇప్పుడు అవి మల్టీ-సిటీ ఈవెంట్స్ లాగా మారిపోయాయి. వేద మంత్రాల కంటే, కెమెరా ముందు ఫోజులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
నెటిజన్లు ఏమంటున్నారు?
"మనం ఈ పెళ్లి కోసం దేన్ని త్యాగం చేస్తున్నాం?" అని ఫైనాన్స్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఒక వీకెండ్ హడావిడి కోసం భవిష్యత్తులో మనకు వచ్చే రిటైర్మెంట్ ఫండ్స్ లేదా ఇంటి కలలను తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసం? వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అనేది నష్టాన్ని తగ్గిస్తుంది నిజమే.. కానీ, అప్పు చేసి మరీ భారీ ఖర్చులు చేయడం అనేది యువత భవిష్యత్తును భారంగా మారుస్తోంది అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? పెళ్లిని సింపుల్‌గా చేసుకోవడం బెటరా? లేక ఇలాంటి వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌తో గ్రాండ్‌గా ప్లాన్ చేయడం కరెక్టా?
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications