For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడాదిగా షేర్లు భారీగా కొంటున్నారు, నెలకు 13 లక్షల కొత్త డిమ్యాట్ ఖాతాలు

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి నుండి మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఓ సమయంలో 26వేల దిగువకు చేరుకున్నాయి. సూచీలు పతనమైన సమయంలో ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోలుకు మొగ్గు చూపారు. అదే సమయంలో కొత్తగా కోట్లాది మంది డీమ్యాట్ అకౌంట్ తీశారు. తద్వారా ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడికి మొగ్గు చూపారు. గత ఏడాది ఏప్రిల్ నుండి ఈ పద్నాలుగు నెలల కాలంలో 1.8 కోట్ల కొత్త డిమ్యాట్ అకౌంట్లు ప్రారంభమయ్యాయి. నెలకు 13 లక్షల కొత్త ఖాతాలు ఓపెన్ చేశారు.

68 శాతం జంప్

68 శాతం జంప్

బీఎస్ఈ డేటా ప్రకారం ఈ ఏడాది మే 31వ తేదీ నాటికి మొత్తం రిటైల్ పెట్టుబడిదారుల సంఖ్య 6.97 కోట్లుగా నమోదయింది. 2020 మార్చి 23వ తేదీన మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనాను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన అనంతరం మార్చి నెలలో సూచీలు దాదాపు 35 శాతం పతనమయ్యాయి. ఆ తర్వాత 2020 డిసెంబర్ నాటికి కాస్త పెరిగి 15 శాతం ఎగిశాయి. ఇక FY20-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి 68 శాతం ఎగిసింది. 2008-09 ఆర్థిక సంక్షోభం అనంతరం సూచీలు 68 శాతం ఎగిశాయి. ఇప్పుడు 68 శాతం పెరిగింది.

కొత్త ఇన్వెస్టర్లు..

కొత్త ఇన్వెస్టర్లు..

కరోనా విజృంభిస్తున్నా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లడంతో పలువురు కొత్త ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. 2020 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ప్రతి నెలా సరాసరిన 13 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమైట్లు బీఎస్ఈ డేటా వెల్లడిస్తోంది. గత 14 నెలలుగా బ్రోకరేజీ సంస్థలు, ఎక్స్ఛేంజీలు సరాసరిన 12 నుండి 15 లక్షల మంది చొప్పున ఈ 14 నెలల కాలంలో మొత్తం 1.8 కోట్ల కొత్త ఇన్వెస్టర్లు జత కలిశారు. అందువల్ల ఈ ఏడాది 31 నాటికి దేశంలో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 6.97 కోట్లకు చేరుకుంది.

ఏపీ, తెలంగాణ ఖాతాలు ఎన్ని అంటే

ఏపీ, తెలంగాణ ఖాతాలు ఎన్ని అంటే

2008-09లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంతో 40 శాతం వరకు కోల్పోయిన స్టాక్ మార్కెట్లు 80 శాతం లాభంతో ఆ ఆర్థిక సంవత్సరాన్ని ముగించగా, 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో బెస్ట్ ముగింపుగా రికార్డ్‌గా ఉంది. మొత్తం డీమ్యాట్ ఖాతాల్లో 25 శాతం మహారాష్ట్ర నుండి ఉన్నాయి. 85.9 లక్షల డీమ్యాట్ ఖాతాలతో గుజరాత్ రెండో స్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్ 52.3 లక్షల డీమ్యాట్ ఖాతాలతో మూడో స్థానంలో నిలిచింది. తమిళనాడు నుండి 42.3 లక్షలు, కర్ణాటక 42.2 లక్షలు, ఆంధ్రప్రదేశ్ 36 లక్షలు, తెలంగాణలో 20.7 లక్షలు ఉన్నాయి.

English summary

ఏడాదిగా షేర్లు భారీగా కొంటున్నారు, నెలకు 13 లక్షల కొత్త డిమ్యాట్ ఖాతాలు | Average 13 lakh new demat accounts added every month since April 2020

Amid near-record rally in the equity markets during the pandemic-ravaged FY21, brokerages have added on an average 13 lakh new demat accounts every month since April last year, taking the overall retail investor headcount to record 6.97 crore as of May 31 this year, according to BSE data.
Story first published: Monday, June 7, 2021, 11:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X