Tata Motors Stock: దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థగా కొనసాగుతున్న టాటా గ్రూప్ నుంచి అనేక లిస్టెట్ కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. టాటాలపై ఉన్న నమ్మకంతో లక్షల మంది కంపెనీల్లో పెట్టుబడులు పెట్టగా ప్రస్తుతం రాబడులతో వారి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కంపెనీల భవిష్యత్ గురించి ప్రస్తుతం ఒక శుభవార్త ఉంది.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది టాటాలకు చెందిన ఆటో సెక్టార్ స్టాక్ టాటా మోటార్స్ కంపెనీ గురించే. టాటా మోటార్స్ షేర్లలో అప్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈరోజు కంపెనీ షేర్ల ధరల్లో 5 శాతం మేర పెరిగాయి. నిన్నటితో పోలిస్తే బీఎస్ఈలో టాటా మోటార్స్ స్టాక్ 5 శాతం జంప్ తర్వాత ఇంట్రా-డే గరిష్ట స్థాయి రూ.1179.05ని తాకాయి. దీంతో టాటా మోటార్స్ స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ క్రమంలో కంపెనీ షేర్లపై నిపుణులు ఇప్పటికీ బులిష్ వ్యూహాన్ని కలిగి ఉన్నారు.

టాటా మోటార్స్ షేర్లు గత వారంలో 18 శాతం పెరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ నోమురా కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ.1,294గా నిర్ణయించింది. అలాగే రేటింగ్ అప్‌గ్రేడ్ చేస్తూ కొనుగోలుకు సలహా ఇచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు టాటా మోటార్స్ స్టాక్ పెట్టుబడిదారులకు 51 శాతం రాబడిని అందించింది. నేడు మార్కెట్ల క్లోజింగ్ సమయంలో కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో 3.38 శాతం పెరిగి రూ.1,162 వద్ద ప్రయాణాన్ని ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4.26 లక్షల కోట్లుగా ఉంది.
టాటా మోటార్స్ లిమిటెడ్ సెప్టెంబర్‌లో తమిళనాడు రాష్ట్రంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ తయారీ యూనిట్‌ను ప్రారంభించనుంది. ఈ లగ్జరీ కార్లు భారత్‌లో ఉత్పత్తి కావడం ఇదే తొలిసారి. ఈ ప్లాంట్‌ను 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో ప్రారంభించనున్నట్లు వార్తా నివేదికల ద్వారా వెల్లడైంది. కంపెనీ కార్యకలాపాల ద్వారా దాదాపు 5000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి. ఆటోమొబైల్ రంగంలో ఉన్న టాటా మోటార్స్ కంపెనీ కార్లు, యుటిలిటీ వాహనాలు, ట్రక్కులు, బస్సులు, రక్షణ వాహనాల ఉత్పత్తి చేస్తోంది. 2008లో రతన్ టాటా బ్రిటీష్ లగ్జరీ కార్ మేకర్ జాగ్వార్, ల్యాండ్ రోవర్‌లను కొనుగోలు చేసి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశారు.


Click it and Unblock the Notifications