Multibagger Stock: పెట్టుబడికి సరైన స్టాక్ ఎంచుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి మనం అనుకున్న రాబడిని అందించగలవా, మార్కెట్ పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా వంటి అనేక అంశాలను కూడా ఇందులో పరిగణలోకి తీసుకోవాలి. ఇదే సమయంలో ఫండమెంటల్స్ బాగున్న కొన్ని కంపెనీలను సెలెక్ట్ చేసుకోవటం కూడా చాలా అవసరం. అవి అనతి కాలంలోనే మల్టీబ్యాగర్లుగా మారి మంచి రిటర్న్స్ అందిస్తాయి. ఆ కోవకు చెందినదే జమ్నా ఆటో స్టాక్ కూడా.
జమ్నా ఆటో(Jamna Auto) రెండేళ్లలో రూ.29 నుంచి రూ.122కి పెరిగి.. 302 శాతం రాబడిని అందించింది. పైగా ఈ స్టాక్ నిన్న తన 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. రెండు సంవత్సరాల కాలంలో లక్ష రూపాయల పెట్టుబడిని ఏకంగా రూ. 4 లక్షలకు పైగా రాబడిని అందించింది.

కంపెనీ వ్యాపారం
జమ్నా ఆటో ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాణిజ్య వాహనాల కోసం సస్పెన్షన్ తయారు చేస్తుంది. భారతదేశంలో పారాబొలిక్ స్ప్రింగ్‌లను కంపెనీ పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించింది. దీని ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో దేశంలోని వాణిజ్య వాహన పరిశ్రమకు సేవలందించే పూర్తి స్థాయి సస్పెన్షన్ సొల్యూషన్‌లను కలిగి ఉంది.

ప్రపంచ స్థాయిలో కంపెనీ ఇలా..
ఆటోమొబైల్ సస్పెన్షన్ సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. TBL ఎక్స్‌ట్రాలైట్ స్ప్రింగ్ టెక్నాలజీ, స్పెషల్ స్టీల్ టెక్నాలజీని కంపెనీకి బదిలీ చేయడానికి UKలోని టిన్‌స్లీ బ్రిడ్జ్ లిమిటెడ్‌తో టెక్నాలజీ కంపెనీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

లాభాల్లో మేటిగా రాణిస్తూ..
కంపెనీ క్యూ4లో పటిష్టమైన పనితీరును కూడా నమోదు చేసింది. నికర అమ్మకాలు రూ. 621 కోట్లుగా ఉన్నాయి. క్వార్టర్లీ ప్రాతిపధికన 40 శాతం, ఏడాది ప్రాతిపధికన 28 శాతం అమ్మకాలు పెరిగాయి. కంపెనీ టాక్స్ చెల్లింపుల తరువాత రూ.57 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.
బలహీనమైన మార్కెట్‌లోనూ కంపెనీ దూసుకుపోతోంది. ఈరోజు రూ.122.25 వద్ద ట్రేడ్ అవుతోంది. షేర్ నిన్న తన 52 వారాల గరిష్ఠమైన రూ. 126.25ను తాకగా.. దీని 52 వారాల కనిష్ఠ ధర రూ.78.60 గా ఉంది.
గమనిక: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. పెట్టుబడులు చేసే ముందు మీ ఆర్థిక సలహాదారును సంప్రదించండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications