నవంబర్ నెలలో ట్రాక్టర్ సేల్స్ పెరిగాయి. కరోనా నేపథ్యంలో అన్-లాక్ తర్వాత వివిధ రంగాల్లో వృద్ధి రేటు మైనస్‌లలో లేదా తక్కువగా ఉంది. కానీ వ్యవసాయ వృద్ధి మాత్రం ఆశాజనకంగా ఉంది. ఫామ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఎస్కార్ట్ అగ్రి మిషనరీ సేల్స్ పెరిగాయి. ఎస్కార్ట్ ట్రాక్టర్లు 2019 నవంబర్ నెలలో 7,642 యూనిట్లు కాగా, ఈ నవంబర్‌లో 33 శాతం పెరిగి 10,165గా నమోదయ్యాయి. సేల్స్ పెరగడంతో డీలర్స్, డిపోలో స్టాక్స్ క్షీణించాయి. రానున్న నెలల్లోను సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నారు.

ఎస్కార్ట్, మహీంద్రా సేల్స్
2019 వంబర్ నెలలో ఎస్కార్ట్ ట్రాక్టర్ సేల్స్ డొమెస్టిక్ 7,379, ఎగుమతులు 263 కాగా, ఈ ఏడాది నవంబర్ నెలలో డొమెస్టిక్ 9,662 యూనిట్లు, ఎగుమతులు 503కు పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ సేల్స్ 56 శాతం ఎగిశాయి. గత ఏడాది నవంబర్ నెలలో మహీంద్రా ట్రాక్టర్ సేల్స్ 21,031 కాగా, ఈ నవంబర్ నెలలో ఏకంగా 32,726కు పెరిగాయి. డొమెస్టిక్ సేల్స్ గత ఏడాది 20,414 కాగా, ఈ నవంబర్ నెలలో 31,619కి పెరిగాయి. ఎగుమతులు 1,107 యూనిట్లుగా నమోదయ్యాయి.

అశోక్ లేలాండ్ సేల్స్
అశోక్ లేలాండ్ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 5 శాతం పెరిగాయి. మీడియం, హెవీ కమర్షియల్ వెహికిల్ సేల్స్ మాత్రం 14 శాతం పెరిగాయి. మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికిల్ సేల్స్ గత ఏడాది నవంబర్ నెలలో 5,966 యూనిట్లు కాగా, ఈ నవంబర్ నెలలో 5,114కు పడిపోయాయి. 14 శాతం క్షీణించాయి. లైట్ కమర్షియల్ వెహికిల్ సేల్ 4,209 యూనిట్ల నుండి 32 శాతం పెరిగి 5545 యూనిట్లకు పెరిగాయి. మొత్తంగా సేల్స్ 10,175 (2019) నుండి 5 శాతం పెరిగి 10659కు పెరిగాయి.

మహీంద్రా సేల్స్...
మహీంద్రా అండ్ మహీంద్రా పాసింజర్ వెహికిల్ సేల్స్ 2019 నవంబర్ నెలలో 14637 కాగా, 24 శాతం పెరిగి 18212 యూనిట్లకు పెరిగాయి. కమర్షియల్ వెహికిల్ సేల్స్ 42 శాతం తగ్గి 6593 నుండి 3854 యూనిట్లకు క్షీణించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ఎగుమతులు 2019లో 2621 యూనిట్లు కాగా, 38 శాత తగ్గి 2020 నవంబర్ నెలలో 1636 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఫామ్ ఎక్విప్మెంట్స్ గత ఏడాది 21031 యూనిట్లు కాగా, 56 శాతం పెరిగి 32726 యూనిట్లకు పెరిగాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications