మారుతీ, టాటా, హోండా, హ్యూండాయ్ సేల్స్ ఎలా ఉన్నాయంటే?
త్వరలో BS-VI ప్రమాణాలు అమలులోకి రావడంతో పాటు కరోనా వైరస్ కారణంగా దేశీయంగా ఆటో సేల్స్ ఫిబ్రవరి నెలలో తగ్గిపోయాయి. మారుతీ సుజుకీ, హ్యూండాయ్, టాటా మోటార్స్, హోండా.. అన్ని కంపెనీల కార్ల సేల్స్ పడిపోయాయి. ఫిబ్రవరి 2019తో పోలిస్తే టాటా మోటార్స్ సేల్స్ ఏకంగా 31 శాతం పడిపోయాయి. హోండా కారు సేల్స్ 46 శాతం పడిపోయాయి.

తగ్గిన ఆటో సేల్స్
గత ఏడాది మందగమనం కారణంగా ఆటో సేల్స్ తగ్గిపోయాయి. కార్లు, బైక్స్ సేల్స్ పుంజుకుంటున్న క్రమంలో బీఎస్ 6 ప్రమాణాల గడువు సమీపించడం, కరోనా వైరస్ కూడా తోడు కావడంతో సేల్స్ పడిపోయాయి. భారత అతిపెద్ద కారు మేకర్ మారుతీ సుజుకీకి చెందిన ప్యాసింజర్ వెహికిల్స్ 2019 ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో 2.3 శాతం తగ్గాయి. జనవరిలో మాత్రం 0.3 శాతం పెరగడం గమానార్హం.

మారుతీ సుజుకీ
మారుతీ సుజుకీ ఆల్టో, ఎస్ ప్రెస్సో కార్ల విక్రయాల్లో 11.1 శాతం నమోదయింది. 2019 ఫిబ్రవరిలో 24,751 యూనిట్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది 27,499 అమ్ముడు పోయాయి. వేగన్ఆర్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ తదితర సేల్స్ 3.9 శాతం తగ్గాయి. ఫిబ్రవరి 2019లో ఈ కారు సేల్స్ 72,678 ఉండగా 2020 ఫిబ్రవరిలో 69,828 సేల్ అయ్యాయి. ఎర్టిగా, ఎస్ క్రాస్, విటారా బ్రెజ్జా, ఎక్ఎల్ 6 సేల్స్ 3.5 శాతం మేర పెరిగాయి. 2019 ఫిబ్రవరిలో 21,834 ఉండగా ఈ ఫిబ్రవరిలో 22,604గా ఉన్నాయి. సియాజ్ కార్లు గత ఏడాది ఇదే నెలలో 3,084 సేల్ కాగా, ఈ ఏడాది 2544కు పడిపోయింది.

హ్యుండాయ్
భారత సెకండ్ లార్జెస్ట్ కారు మేకర్ హ్యుండాయ్ సేల్స్ ఫిబ్రవరిలో 7.2 శాతం పడిపోయాయి. 2019 ఫిబ్రవరిలో 43,110 విక్రయించగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 40,010 అమ్ముడయ్యాయి. హోండా కార్స్ ఇండియా సేల్స్ 13,527 నుండి 7,269కు తగ్గాయి. ఈ తగ్గుదల 46.26 శాతం.

టాటా మోటార్స్
టాటా మోటార్స్ సేల్స్ 31 శాతం మేర పడిపోయాయి. 2019 ఫిబ్రవరిలో 18,110 యూనిట్ల నుండి 2020 ఫిబ్రవరిలో 12,430కు పడిపోయాయి. గత జనవరిలో BS 6 ప్రమాణాలు కలిగిన నెక్సాన్, టియాగో, టిగోర్‌లను ఆవిష్కరించింది. అయినప్పటికీ సేల్స్ తగ్గిపోయాయి.

మహీంద్రా సేల్స్
మహీంద్రా సేల్స్ 42 శాతం పడిపోయాయి. 2019 ఫిబ్రవరిలో 56,005 యూనిట్లు విక్రయించగా ఇప్పుడు 32,476 తగ్గాయి. అలాగే ఎగుమతులు కూడా 40 శాతం పడిపోయి 3,090 నుండి 1,839 యూనిట్లకు తగ్గాయి. మహీంద్రా అండ్ మహీంద్రా యుటిలిటీ కార్లు, వ్యాన్లు కలిపి గత ఏడాది ఫిబ్రవరిలో 26,109 విక్రయించగా, ఈసారి 10,938గా ఉంది. ఈ విక్రయాలు 58 శాతం తగ్గాయి. కమర్షియల్ వెహికిల్ సేల్ 21,154 నుండి 15,856 యూనిట్లకు తగ్గాయి. ఇది 25 శాతం తగ్గుదల. హెవీ కమర్షియల్ వెహికిల్స్ 686 నుండి 436కు పడిపోయాయి.

బజాజ్
బజాజ్ డొమెస్టిక్ టూ వీలర్ సేల్స్ 21 శాతం పడిపోయాయి. అశోక్ లేలాండ్ వాహనాల సేల్స్ 37 శాతం పడిపోయి 18,245 నుండి 11,475కు తగ్గాయి. కరోనా వైరస్ కారణంగా విడిభాగాలు రాకపోవడంతో విక్రయాలు తగ్గాయని, అలాగే, బీఎస్ 6 ప్రమాణాలు అమలు కానుండటం కూడా ఓ కారణమని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications