Mahindra & Mahindra: దేశంలో ఆటోమోటివ్ విభాగం బలమైన పనితీరు, అనుకూలమైన ఉత్పత్తి, ఆపరేటింగ్ పరపతి ప్రయోజనాలతో ఈ రంగంలోని కంపెనీలు ఉత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. అవి కంపెనీల క్యూ4 ఫలితాల్లో ప్రతిబింబిస్తున్నాయి.
తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా తన స్వతంత్ర నికర లాభం ఏడాది ప్రాతిపదికన 32 శాతం పెరిగి రూ.2,038 కోట్లుగా నమోదైనట్లు నివేదించింది. కిందటి ఏడాది జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.1,549 కోట్లుగా ఉంది. ఇదే క్రమంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం మార్చి త్రైమాసిక కాలంలో 11 శాతం పెరిగి గతంలో ఉన్న రూ.22,571 కోట్ల నుంచి ప్రస్తుతం రూ.25,109 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. మహీంద్రా త్రైమాసికంలో అంతకుముందు సంవత్సరం కంటే 27.2 శాతం ఎక్కువ SUVలను విక్రయించింది.

ప్రస్తుతం ఆటో దిగ్గజం తన అధిక వృద్ధి పథాన్ని కొనసాగించింది. కఠినమైన మార్కెట్‌లో మెరుగైన వాటాను పొందటంతో పాటు మహీంద్రా ఫైనాన్స్ ఆస్తి నాణ్యతను అందించిందని M&M మేనేజింగ్ డైరెక్టర్, CEO అనిష్ షా తెలిపారు. కంపెనీ అత్యుత్తమ పనితీరుతో ఆటో దిగ్గజం ఒక్కో షేరుపై అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు రూ.21.10 డివిడెండ్ అందించాలని బోర్డు నిర్ణయించింది. రాబడుల ప్రకారం కంపెనీ ఎస్‌యూవీ కేటగిరీలో నెం-1 ప్లేయర్‌గా కొనసాగుతున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & CEO (ఆటో & ఫార్మ్ సెక్టార్) రాజేష్ జెజురికర్ అన్నారు.
క్రమశిక్షణతో కూడిన మూలధన కేటాయింపు మరియు ఆపరేటింగ్ మెట్రిక్‌లపై తీవ్ర దృష్టి పెట్టడం FY24లో రికార్డు స్థాయిలో నగదు ప్రవాహాలను సృష్టించడంలో సహాయపడిందని M&M గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మనోజ్ భట్ తెలిపారు. వాస్తవానికి ప్రస్తుతం కంపెనీ ఫలితాలు మార్కెట్లో బ్రోకరేజ్ అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 7 శాతం పెరిగి రూ.24,182 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. సాయంత్రం 2.49 గంటల సమయంలో షేర్ ధర స్వల్పంగా లాభంతో రూ.2,322గా కొనసాగుతోంది
కంపెనీ ఆటోమోటివ్ వ్యాపారం మొత్తం ఆదాయంలో దాదాపు మూడింట రెండు వంతుల ఆదాయాన్ని కలిగి ఉంది. స్కార్పియో, థార్ వంటి వాణిజ్య వాహనాలు, SUVల విక్రయాలను కలిగి ఉంటుంది. అలాగే దేశంలోని అతిపెద్ద ట్రాక్టర్-తయారీదారు అమ్మకాల ద్వారా ఆదాయాలు ట్రాక్టర్, వ్యవసాయ పరికరాల అమ్మకాల్లో 21.5 శాతం పడిపోయాయి. ఆటోమోటివ్ సెగ్మెంట్ ఆదాయం 20 శాతం పెరిగిందని, వ్యవసాయ పరికరాల విభాగంలో 13.1 శాతం తగ్గిందని కంపెనీ తన ఫలితాల్లో వెల్లడించింది.


Click it and Unblock the Notifications